Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhar Card Update :

 ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా ?  అప్డేట్ చేసుకోవాల్సిందే . కేంద్రం కొత్త రూల్

Aadhar Card Update :
Aadhar Card Update : ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటినవారు అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గెజిట్​ను విడుదల చేసింది.

Aadhar Card Update : కేంద్రం ప్రభుత్వం.. ఆధార్ నిబంధనలను సవరించింది. ఆధార్ పొందిన 10 సంవత్సరాలు తర్వాత కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు అయినవాళ్లు గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. గతేడాది 16 కోట్లు మంది ఆధార్​ కార్డులను అప్డేట్ చేసుకున్నారు. దేశంలో ఆధార్ కలిగి ఉన్నవారు 134 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఇంకా అప్డేట్ చేస్కోవాల్సి ఉందన్న విషయంపై స్పష్టత లేదు.

"పదేళ్ల క్రితం ఆధార్​ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్​' పోర్టల్​ లేదా దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు."
-కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ

దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్​ కార్డులు జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా వేర్వేరు అవసరాలను ఆధార్​ను ఉపయోగిస్తోంది కేంద్రం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhar Card Update :"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0