Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Moolana Anul Kalam Aazad

జాతీయ విద్యా దినోత్సవం చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం.

About Moolana Anul Kalam Aazad

దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే

మనం ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు.

స్వాతంత్ర్యం వచ్చాక మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ పనిచేశారు. 1947 నుంచి 1958 వరకు తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా విద్య, జాతీయాభివృద్ధికి, సంస్థల బలోపేతానికి ఆయన చేసిన సేవలను నేడు స్మరించుకుంటారు. ఈ రోజు చదువు విలువ గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా ప్రజలకు విద్య ఆవశ్యకతపై అవగాహన పెంచి, ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు రప్పించే ఏర్పాట్లు చేస్తారు.

మొదటి విద్యాశాఖ మంత్రి జన్మదినమే.. జాతీయ విద్యాదినోత్సవం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అబుల్ కలాం భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

స్వాతంత్య్ర సమర యోధుడిగా.. భారతప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పనిచేశారు. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు..'ఆజాద్' అనేది ఆయన కలంపేరు. 1888 నవంబరు 11న మక్కాలో ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు అబుల్ కలాం జన్మించాడు. ఆయన అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు.

మౌలానా ఆజాద్.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించారు. గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ"ఉద్యమాన్ని సమర్థించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించినాడు. 1923లో ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. స్వయంగా సాహితీవేత్త అయిన మౌలానా 'ఇండియా విన్స్ ఫ్రీడమ్‌'ను రాశారు.

 విద్యకు ఆద్యుడు

స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషిచేశారు. దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. బ్రిటిష్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారు. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు ఏర్పాటు చేశారు.

ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే UGC, ICCR, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో సాంకేతిక విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సంగీత, సాహిత్య, లలితకళల సర్వతోముఖాభివృద్ధికి అకాడమీలను ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆరట్స్ అకాడమీలను ఆయన స్థాపించారు.

భారత రత్నతో సన్మానం

భారత విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది. అంతేకాకుండా భారత విద్యారంగాన్ని పరిపుష్టం చేసి.. విద్యావిధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి దారులు వేసిన ఆ మహానుభావుడి జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పరమపదించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Moolana Anul Kalam Aazad"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0