Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ABOUT SUPAR STAR KRISHNA

 సూపర్ స్టార్ కృష్ణ

ABOUT SUPAR STAR KRISHNA

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అవడంతో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు నరేష్. ఈ విషయం నిన్న ఉదయం బయటకు వచ్చింది. అయితే ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని ప్రస్తుతం పరిస్థితి ఏ మాత్రం బాలేదని వైద్యులు నిన్న మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు. 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని అప్పుడే ప్రకటించారు వైద్యులు.

అయితే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కావడంతో కృష్ణ ఈరోజు తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల 9 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు.. అయితే కృష్ణ పార్థివ దేహాన్ని ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన నివాసమైన విజయకృష్ణ నివాసం అనే భవనానికి తరలించారు. ఈ భవనాన్ని ఆయన, విజయనిర్మల ఇద్దరూ కలిసి చాలా ఇష్టపడి నిర్మించుకున్నారు. తమ అభిరుచికి తగినట్లుగానే ఇంటిలోని ప్రతి అణువణువు తీర్చిదిద్దారు.

స్నేహితులను నిర్మాతలను ఆదుకునే మంచి మనసున్న వాడు కృష్ణ

కృష్ణ డబ్బుకు ఏనాడూ విలువ ఇవ్వలేదు. వరుస హిట్స్ పడినా అమాంతం రెమ్యూనరేషన్ పెంచేవారు కాదు. కృష్ణ తన ఫస్ట్ మూవీ తేనె మనసులు కు రూ. 2000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆరు దశాబ్దాల క్రితం అది పెద్ద మొత్తమే అని చెప్పాలి. గూఢచారి 116, సాక్షి వంటి హిట్ చిత్రాలతో కృష్ణ త్వరగానే ఫేమ్ తెచ్చుకున్నారు. అయినా 40 చిత్రాలు చేసే వరకు కృష్ణ రెమ్యూనరేషన్ రూ. 5000 అంట. 

నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న కృష్ణ తన మూవీ ఫెయిల్యూర్ తో నష్టపోయిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా మరో చిత్రం చేసి పెట్టేవారట. ఆ విధంగా నిర్మాతలను ఆదుకునేవాడట. ఇక పరిశ్రమలో ఎవరు ఆపదలో ఉన్న కృష్ణ చేయూత అందించేవారట. స్నేహితులను నమ్మి కృష్ణ కోట్లలో నష్టపోయారని సమాచారం. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వని వారు ఎందరో ఉన్నారట. 

నిర్మాతగా మారి ఆయన అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. వాటిలో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని తీవ్ర నష్టాలు మిగిల్చాయి. కొత్త జోనర్స్, రిస్క్ తో కూడిన సినిమాలు ఆయనే నిర్మించేవారు. ఈ కారణాలతో కృష్ణ సంపాదించిన మొత్తంలో చాలా వరకు కోల్పోయారు. 

‘సింహాసనం’ చిత్ర వందరోజుల పండగ విశేషాలు

అనేక తర్జనభర్జనలు చేశాక  ‘సింహాసనం’ చిత్ర వందరోజుల పండగ మద్రాసులో నిర్వహించాలనుకున్నారు. అన్ని అనుమతులు తీసుకున్నారు. ‘వేడుకకి ఎంతమంది వస్తారు?’ అని పోలీసులు అడిగారు.

అనేక తర్జనభర్జనలు చేశాక  ‘సింహాసనం’ చిత్ర వందరోజుల పండగ మద్రాసులో నిర్వహించాలనుకున్నారు. అన్ని అనుమతులు తీసుకున్నారు. ‘వేడుకకి ఎంతమంది వస్తారు?’ అని పోలీసులు అడిగారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి చెన్నై దూరం కాబట్టి ఐదారువేల మంది రావొచ్చని కృష్ణ (sper star krishna), దర్శకనిర్మాతలు భావించారు. కానీ అనూహ్యంగా ఆ సంఖ్య పెరిగింది. ఆ అభిమాన సముద్రం ఎంతలా ఉందంటే.. కార్యక్రమం నిర్వహించిన ప్రాంగణం నుంచి 12 కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. అతిథులుగా వచ్చిన రజనీకాంత్‌, జితేంద్రలు అత్యంత కష్టంగా వేదికపైకి రాగలిగారు. మందాకిని, జయప్రద, రాధ తదితర ఆర్టిస్టులు కనీసం స్టేజీ మీదకి రాలేకపోయారు.

1983 ఎంతో ప్రత్యేకం..

కృష్ణ సినీ కెరీర్‌లో 1983వ సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యముంది. ఆ ఏడాది ఆయన 13చిత్రాల్లో నటించగా.. అందులో 8 సినిమాలు విజయవంతమయ్యాయి. వాటిలో తన తల్లి నాగరత్నమ్మ నిర్మాతగా ఉన్న ‘ప్రజారాజ్యం’ ఒకటి. అలాగే ఆయన పద్మాలయా బ్యానర్‌పై నిర్మించిన ‘హిమ్మత్‌వాలా’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘మవాలి’ చిత్రాలు అదే ఏడాది విడుదలై ఘన విజయం సాధించాయి. ఇలా ఒక సంస్థ నిర్మించిన మూడు హిందీ చిత్రాలు ఒకే సంవత్సరంలో విడుదలై.. విజయాలు సొంతం చేసుకోవడం ఓ రికార్డే. అంతేకాదు అదే సంవత్సరంలో హైదరాబాద్‌లో పద్మాలయా స్టూడియో నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు ఆ ఏడాదికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దాని గురించి కృష్ణ ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘నా కెరీర్‌లోనే కాదు.. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించిన సంవత్సరమది. నా అభిమాన నటుడు ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంత తక్కువ కాలంలో ఒక చలన చిత్ర నటుడు ముఖ్యమంత్రి కావడం ప్రపంచ చరిత్రలోనే ప్రథమం. ఈ సంఘటన వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రాజకీయ పరంగా కొత్త విలువ, గౌరవం ఏర్పడ్డాయి’’ అని వివరించారు.

భార్యగా ఉండగా విజయనిర్మలను కృష్ణ ఎందుకు వివాహమాడారు ... ఇందిరా దేవి రియాక్షన్ ఏమిటీ ?


బంధాలు ఎప్పుడు? ఎవరితో? ఎలా మొదలవుతాయో చెప్పలేం. కృష్ణ-విజయనిర్మల పరిచయం, ప్రేమ, వివాహం కూడా అలాంటిదే. వృత్తిపరంగా కలిసిన విజయనిర్మల-కృష్ణ వ్యక్తిగతంగా దగ్గరయ్యారు. కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. 

సినిమాల్లోకి రాకముందే కృష్ణ-ఇందిరాదేవిల వివాహం జరిగింది.  1962 లో చదువు పూర్తయ్యాక కృష్ణకు వివాహం జరిపించారు. సినిమాపై మక్కువతో కృష్ణ మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆయన 1965లో విడుదలైన తేనెమనసులు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

గూఢచారి, సాక్షి చిత్రాలు కృష్ణకు బ్రేక్ ఇచ్చాయి. అవి సూపర్ హిట్స్ కావడంతో ఆయనకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు. ఆ మూవీలో కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై పండింది. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగేలా చేసింది. కృష్ణ విజయనిర్మలను రహస్య వివాహం చేసుకున్నారంటే ఆమె రియాక్షన్ ఏమై ఉంటుందంటే ఆసక్తి అందరిలో ఉంది. 

విజయనిర్మల వ్యక్తిత్వం, తెలివితేటలు నచ్చిన కృష్ణ ఒకరోజు గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు. విజయనిర్మలకు కూడా అది రెండో వివాహం.నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం.  ఆమెకు మొదటి భర్తతో విబేధాలు ఉన్నాయి. ఇక ఈ రహస్య వివాహాన్ని మొదటి భార్య ఇందిరా వద్ద కృష్ణ దాచలేదు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు చెప్పేశారట. ఆ మాట విన్న ఇందిరా దేవి మౌనంగా ఉండిపోయారట. ఏం మాట్లాడకుండా తన అంగీకారం తెలిపారట.  

ఇందిరాదేవిలోని మరో గొప్ప విషయం ఆమె సవతిని అంగీకరించడం. కృష్ణ నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నా ఆమె అంగీకరించారు. భర్తతో విభేదించకుండా కలిసి ఉన్నారు. కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు. కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు. ఏళ్ల తరబడి ఇందిరా దేవి అజ్ఞాతంలో ఉంది పోయారు. ఆమె నేమ్ ఫేమ్ కోరుకోలేదు. భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ... లోప్రొఫైల్ మైంటైన్ చేశారు. కృష్ణ భార్య పేరు చెప్పమంటే టక్కున విజయనిర్మల అని చెప్పేవారే ఎక్కువ. మొదటి భార్య ఇందిరా దేవి గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ.

 రెండో వివాహం చేసుకున్నప్పటికీ తన భర్తగా కూడా కొనసాగాలని ఇందిరా దేవి కోరుకున్నారట . ఆ విధంగా కృష్ణ విజయనిర్మల, ఇందిరా దేవిలతో సాన్నిహిత్యం కొనసాగించారు. ఇక ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు పద్మజ, మంజుల, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 

 విజయనిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు. నరేష్ విజయనిర్మలతో మొదటి భర్తకు పుట్టిన సంతానం. ఇక ఇందిరా దేవి దశాబ్దాల పాటు కెమెరా వెనుకుండిపోయారు. ఆమె ఎలాంటి పబ్లిక్ వేడుకల్లో పాల్గొనేవారు కాదు. ఇంటికే పరిమితమయ్యేవారు. ఇందిరా దేవి కావాలనే లో ప్రొఫైల్ మైంటైన్ చేసేవాళ్ళు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కృష్ణకు వివాదం. మొండిగా ముందుకు వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృష్ణ.


ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కృష్ణకు వివాదం చోటు చేసుకుంది. దీంతో స్టార్ సింగర్ బాలునే పక్కన పెట్టేశాడు. కొన్ని విషయాల్లో కృష్ణ చాలా మొండిగా ఉండేవారు. 

80వ దశకంలో బాలు సింగర్ గా వెలిగిపోతున్నారు. బాలు పాడితేనే పాట అన్న రోజులు అవి. ప్రతి సినిమాలో ఐదారు పాటలు బాలునే పాడేవారు. బాలు పాడితే సినిమాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్న సమయంలో కృష్ణ తీసుకున్న సాహస నిర్ణయాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ఒక సందర్భంలో కృష్ణ తనతో కఠినంగా మాట్లాడారని ఆయన చిత్రాలకు పాటలు పాడేది లేదని బాలు మంకు పట్టుబట్టారు. 

ఈ విషయం తెలిసిన కృష్ణ కూడా అదే బెట్టు మైంటైన్ చేశారు. 1986లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో సింహాసనం తెరకెక్కింది. ఇది భారీ బడ్జెట్ మూవీ. కృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి సంగీతం అందించారు. ఈ మూవీలో పాటలన్నీ రాజ్ సీతారామ్-పి సుశీల పాడారు. సింహాసనం పాటలు గ్రాండ్ సక్సెస్. తెలుగుకు ప్రేక్షకులకు రాజ్ సీతారామ్ గొంతు భిన్నంగా తోచింది. అప్పట్లో సింహాసనం పాటలు ప్రతి వేడుకలో మారుమ్రోగేవి. 

ఎస్పీ బాలును కాదని కృష్ణ అంత పెద్ద విజయం సాధించారు. వేటూరి, రాజ్ కోటి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారట. అయినా వివాదం సద్దుమణగలేదట. ఒకరోజు బాలు పద్మాలయా స్టూడియోకి వచ్చారట. అప్పుడు బాలు, కృష్ణ మనసు విప్పి మాట్లాడుకున్నారట. ఈ ఇగోలు, మనస్పర్థలు వదిలేసి కలిసి పని చేద్దాం అనుకున్నారట. అలా వివాదం ముగిసింది. తర్వాత కృష్ణ చిత్రాలకు బాలు అనేక పాటలు పాడారు. 

ఎన్టీఆర్  కృష్ణ లకు పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంత వైరం.ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఇవే.

ఎన్టీఆర్-కృష్ణ అతిపెద్ద మాస్ హీరోలుగా తెలుగు తెరను ఏలారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే అపురూప విజయాలు అందించారు. కలిసి మల్టీస్టారర్స్ చేశారు. మరి వీరిద్దరి మధ్య అంత పెద్ద అగాథం ఎందుకు ఏర్పడింది? ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు నిర్మించడానికి కారణం ఏమిటీ?

1983లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠం అధిరోహించారు. ఆ తర్వాత కృష్ణ వరుసగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ సినిమాలు చేశారు. ఆయన ప్రజానేత కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జీవితంలోని చీకటి రహస్యాలు ఇవేనంటూ బయటపెట్టాలని చూశారు.  వాస్తవం ఏదైనా ఎన్టీఆర్ అసలు క్యారెక్టర్ ఇదంటూ కృష్ణ తూర్పారబట్టారు. ఎన్టీఆర్ తో కృష్ణకు ఏర్పడిన విబేధాలే దీనికి కారణం అంటారు. అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ కాగా... ఆయన బయోపిక్  చేసిన కృష్ణ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. వీరిద్దరి గొడవకు పునాది పడింది అక్కడే అంటారు. మరొక కారణం కృష్ణ కాంగ్రెస్ లో చేరడం. రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీలో ఎన్టీఆర్ విధి విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్న రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు కృష్ణ ఎన్టీఆర్ ని దెబ్బతీసేందుకు అలాంటి సినిమాలు చేశారనే వాదన కూడా ఉంది. మరి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.

1986లో కృష్ణ దర్శకత్వంలో సింహాసనం మూవీ విడుదలైంది. కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో కైకాల సత్యనారాయణ రాజగురువు పాత్ర చేశారు. సత్యనారాయణ లుక్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధరించిన కాషాయ వస్త్రధారణ లుక్ లా ఉంటుంది. అలాగే ఈ మూవీలో సత్యనారాయణ చేత ఎన్టీఆర్ తరచుగా చెప్పే... 'ఏముంది నా దగ్గర బూడిద' అనే డైలాగ్ చెప్పించారు. సింహాసనం మూవీలో కైకాల సత్యనారాయణది నెగిటివ్ రోల్. 

తర్వాత అదే ఏడాది 'నా పిలుపే ప్రభంజనం' మూవీ చేశారు కృష్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిన పాత్ర కైకాల సత్యనారాయణ చేశారు. ఈ మూవీలోని కీలక పొలిటికల్ డైలాగ్స్ ని కృష్ణ దర్శకుడు దాసరి నారాయణ చేత రాయించారట. అయితే ఆయన పేరు క్రెడిట్స్ లో వేయలేదు. నా పిలుపే ప్రభంజనం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా అని తెలిసి అభిమానులు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే వివాదం సినిమాకు మరింత హైప్ తెస్తుందని ఎన్టీఆర్ వారిని వారించాడట. నా పిలుపే ప్రభంజనం మంచి సక్సెస్ అందుకుంది. కేంద్రం మద్దతుతో సినిమాను బ్యాన్ చేయాలని మాత్రం చూశారట ఎన్టీఆర్.  

కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా మండలాధీశుడు మూవీ తెరకెక్కించారు. మండలాధీశుడు మూవీలో కోటా శ్రీనివాసరావు అచ్చు ఎన్టీఆర్ ని పోలిన గెటప్ లో ఉంటారు. ఆయనది పూర్తి నెగిటివ్ రోల్. భానుమతి ఈ చిత్రంలో కీలక రోల్ చేశారు. ఈ సినిమా చేసినందుకు కోటా శ్రీనివాసరావు ఆఫర్స్ కోల్పోయారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో దాడికి ప్రయత్నం చేశారు.

ఎన్టీఆర్ పై కృష్ణ సంధించిన మరొక పొలిటికల్ థ్రిల్లర్ సాహసమే నా ఊపిరి. ఈ చిత్రానికి కృష్ణ భార్య విజయనిర్మల డైరెక్టర్. నరేష్ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ అనేక పొలిటికల్ సెటైర్స్, విమర్శనాస్త్రాలు ఉంటాయి. 

ఇక గండిపేట రహస్యం మూవీలో ఎన్టీఆర్ ని ఏకిపారేశారు. నరేష్ హీరోగా నటించిన ఈ మూవీలో విజయ నిర్మల కీలక రోల్ చేశారు. 30 ఇయర్స్ పృథ్వి అచ్చు ఎన్టీఆర్ ని పోలిన గెటప్ లో నెగిటివ్ రోల్ చేశారు. ఈ చిత్రానికి నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. ఇంకా కృష్ణ నటించిన అనేక చిత్రాల్లో ఎన్టీఆర్ పాలిటిక్స్ పై ఆయన సెటైర్స్ పేల్చారు. 

అనూహ్యంగా కృష్ణ చేసిన ఒక సినిమా ఎన్టీఆర్ కి రాజకీయంగా మేలు చేసింది. ఈనాడు టైటిల్ తో కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కాంగ్రెస్ విధానాలను తప్పుబట్టారు. 1982 లో ఈనాడు విడుదల కాగా 1983 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ అయిదుగురు..


  • రామారావు (44 యేళ్ళ కెరీరు - 300 సినిమాలు)
  • నాగేశ్వర్రావు (72 యేళ్ళ కెరీరు; 255 సినిమాలు)
  • శోభన్ బాబు (37 యేళ్ళలో 230 సినిమాలు)
  • కృష్ణంరాజు (55 యేళ్ళు; 190 సినిమాలు)
  • కృష్ణ (50 యేళ్ళు; 350 సినిమాలు)  

అయిదుగురూ కలిసి 200 యేళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీరు, 1325 సినిమాలు.. అంటే యావరేజిన యేడాదికి ఆరు సినిమాలు.. అంటే రోజూ రెండు షిఫ్టులు పనిచేస్తే కానీ పూర్తికానంత పని..

వీళ్ళు ఎటెంప్ట్ చేయని జాన్రా లేదు.. సాంఘికం, పౌరాణికం, జానపదం, డ్రామా, కామెడీ, రొమాన్సు, ఫ్యామిలీ, యాక్షన్, హారరు.. అన్నీ చేశారు.. తమ కెరీరు పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు.

ఒకపక్కన అభిమానులు పోస్టర్ల మీద భీకరమైన పేడ యుధ్ధాలు చేస్కుంటూ ఉన్న సమయంలో మల్టీస్టారర్స్ చేశారు.. ఏ సీజీలూ లేని ఆర్గానిక్ ఫైట్లూ, డాన్సులూ చేశారు.

లేబొరేటరీ దగ్గర రిలీజుకి ముందు రోజులతరబడి జరిగే ప్రింటింగు ప్రాసెస్సులు, వందలకొద్దీ ప్రింట్లు, వేలకొద్దీ రీలు బాక్సులు, బస్తాలతో కలెక్షన్ల క్యాషు తీసుకొచ్చి బ్యాంకుల్లో గుట్టగా పోసే డిస్ట్రిబ్యూటర్లు, రీలు బాక్సులు పట్టుకుని పరుగులు తీసే థియేటరు కుర్రాళ్ళు, టికెట్ కౌంటర్లదగ్గర చొక్కాలు చిరిగిపోయి మోచేతులు డోక్కుపోయేంతగా ముష్టియుధ్ధాలు, హీరో ఎంట్రీలకు చిరిగిపోయే స్క్రీన్లు, ఈలల సౌండుకి పగిలిపోయే స్పీకర్లు, యాభై అడుగుల ఎత్తులో భారీ కటౌట్లు, పదిరూపాయల టికెటు వందకి అమ్ముడుపోయేంత బ్లాక్ ఫివర్, శతదినోత్సవాలు, సిల్వర్ జూబిలీలు, యేడాదికి పైగా ఆడించిన ప్లాటినం జూబిలీలు, లక్షలకు పైగా అమ్ముడుపోయే ఆడియో క్యాసెట్లు, డైలాగు డ్రామాలు.

అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకున్న ప్రత్యేకమైన స్థానాన్ని పదిలంగా కాపాడారు.. జాతికి విపత్తు వొచ్చినప్పుడు అందరూ ఒక్కటై అందరినీ ఒక్కతాటిమీదికి తీసుకొచ్చి జోలెపట్టి విరాళాలు సేకరించారు.. ఉద్యమాలు చేశారు, రాజకీయాల్లో పాల్గొన్నారు, పదవులు చేపట్టారు, పద్మశ్రీలు సంపాదించుకున్నారు.

ఈ తరం వెళ్ళిపోయింది.. ఈ యేడాది కృష్ణంరాజు, కృష్ణ ఇద్దరూ వెళ్ళిపోవడంతో ఒక శకం ముగిసిపోయింది.

ఈరోజు తెలుగు సినీ అభిమాని ప్రతి ఒక్కరూ వీళ్ళందరికీ నివాళిగా ఒక్క కన్నీటిబొట్టు రాల్చాల్సిన సమయం.. అందరినీ గుర్తుతెచ్చుకుని గుండెల్లోని అభిమానాన్ని పెదాలమీదికి తెచ్చుకుని హాయిగా ఓ చిరునవ్వు నవ్వాల్సిన సమయం..

సూపర్ స్టార్ కృష్ణ నటించిిిన 345 చిత్రాల వివరాలు

CLICK HERE SUPER STAR 345 MOVIES LIST

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ABOUT SUPAR STAR KRISHNA"

Post a Comment