Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About T - Shirts

 టీ-షర్ట్స్ గురించి తెలియని నిజాలు

About T - Shirts

ప్రజెంట్ జనరే షన్ టీ-షర్ట్స్ అనేవి చిన్నా, పెద్దా అనే తేడాల్లేకుండా అందరూ వాడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచంలో "టీ-షర్ట్" ఓ ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల టీ-షర్టులు అమ్ముడవు తున్నాయి. టీ-షర్ట్స్ గురించి ఎవరికీ తెలియని మరిన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1904లో టీ-షర్టును మొదటిసారిగా కూపర్ అండర్‌వేర్ కంపెనీ ఉత్పత్తి చేసి విక్రయించింది. అందుకే వాటిని పొడవాటి లోదుస్తులు(అండర్‌వేర్స్)అని పిలిచేవారు. మొదట1970లలో పాప్ కల్చర్ లోకి ప్రవేశించాయి. ఇవి1980సంవత్సరంలో మరింతగా ప్రజాదరణ పొందాయి.

ప్రముఖ కూల్ డ్రింగ్ సంస్థ కోకా-కోలా మొదటి సారిగా టీ-షర్ట్స్ తో తమ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేసింది. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆ సంస్థ తయారుచేసిన కూల్ డ్రింక్స్ ను టీ-షర్ట్స్ పై ముద్రించి మార్కెట్లోకి ప్రవేశపెటింది. 

ఒక్క టీ-షర్టును తయారు చేయడానికి 6 మైళ్ల నూలు అవసరం పడుతుంది. అయితే దాదాపు 1200 టీ-షర్టులను ఉత్పత్తి చేయడానికి కేవలం ఒక ఎకరం పొలంలో పండిన పత్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. జూన్ 21తేదీన అంతర్జాతీయ టీ-షర్టు డే గా పరిగణిస్తారు. టీ-షర్టు1868లో న్యూయార్క్‌లో పేటెంట్ పొందిన "యూనియన్ సూట్" అని పిలిచే ఒక రకమైన ఆల్ ఇన్ వన్ అండర్ వేర్ నుంచి వచ్చినట్లు నమ్ముతారు. చాలా మంది కార్మికులు వేడి వాతావరణంలో చల్లగా ఉండటానికి ఈ దుస్తులను వాడేవాళ్ళట. 

స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ 1920లో తన నవల "దిస్ సైడ్ ఆఫ్ ప్యారడైజ్‌"లో టీ-షర్ట్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. తొలిసారిగా అమెరికన్ ఫాంటసీ మూవీ ప్రమోషన్ కోసం టీ-షర్ట్ ను వినియోగించారు. అదే1939లో వచ్చిన "ది విజార్డ్ ఆఫ్ ఓజ్" చిత్రం.

టీ-షర్టులను మొదటిసారిగా

 టీ-షర్టులను మొదటిసారిగా "ట్రోపిక్స్ టాగ్స్" అనే కంపెనీ డిజైన్ చేసింది. తొలిసారిగా పాప్ కల్చర్ కు సంబంధించిన సింబల్స్ తో టీ-షర్టులను ముద్రించింది. మార్లోన్ బ్రాండో, జాన్ వేన్, జేమ్స్ డీన్ వంటి సినీ నటులు టీ-షర్టులను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అమెరికన్లు ఎక్కువ శాతంమంది టీ-షర్టులే ధరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 56 మిలియన్ల టీ-షర్టులు అవసరం అవుతాయి. టీ-షర్టుకు రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫాబ్రిక్ పత్తి ఆ తర్వాత పాలిస్టర్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About T - Shirts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0