Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Chance of rains in AP, Telangana - more alert for those in these areas

 ఏపీ , తెలంగాణంలో వర్షాలు పడే అవకాశం- ఈ ప్రాంతాల్లోని వారికి మరింత అలెర్ట్.

Chance of rains in AP, Telangana - more alert for those in these areas

గ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అదే తీవ్రతతో నెమ్మదిగా కదులుతోంది. 24గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలవైపు రానుంది.

ఇది గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్‌కు తూర్పున 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది వచ్చే 6 గంటల్లో ఇప్పుడున్న తీవ్రతతోనే కొనసాగనుంది. తర్వాత వాయువ్య దిశగా నెమ్మదిగా కదులబోతోంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది 24 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు కదులుతుంది.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాలవైపు వచ్చే క్రమంలో అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారం, బుధవారం దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Chance of rains in AP, Telangana - more alert for those in these areas"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0