KVS Recruitment 2022
KVS Recruitment 2022 : గుడ్ న్యూస్ . 6,414 ప్రైమరీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ .
కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు.. TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రైమరీ టీచర్ పోస్టులు 6414 ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభం అయి , జనవరి 02 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను www.kvsangathan.nic.in. సందర్శించొచ్చు.
కేటగిరీల వారీగా పోస్టులు
జనరల్ - 2599
ఓబీసీ -1731
ఎస్సీ - 962
ఎస్టీ - 481
ఈబ్ల్యూఎస్ - 641
ఓహెచ్ - 97
వీహెచ్ - 96
మొత్తం పోస్టులు - 6414
దరఖాస్తు ఫీజు.
- ప్రిన్సిపల్ పోస్టులకు .. జనరల్ / OBC : రూ.1200
- TGT/PGT/PRT పోస్టుల కోసం : Gen / OBC : రూ.750
- SC / ST / PH : నిల్
- ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించొచ్చు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం : 05-12-2022
- దరఖాస్తు కు చివరి తేదీ: 26-12-2022
- పరీక్ష ఫీజు కు చివరి తేదీ : 26-12-2022
- పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుల జారీ తేదీ త్వరలో తెలియజేయనున్నారు.
మొత్తం పోస్టులు : 6990
- 1. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52
- 2. ప్రిన్సిపల్ పోస్టులు 239
- 3. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 203
- 4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు - 1409
- 5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు - 3176
- 6. లైబ్రేరియన్ పోస్టులు - 355
- 7. ప్రైమరీ టీచర్స్ (మ్యూజిక్) - 303
- 8. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు - 06
- 9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు - 02
- 10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - 156
- 11. హిందీ ట్రాన్స్ లేటర్ - 11
- 12. సినీయర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు - 322
- 13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు - 702
- 14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు - 54
పరీక్ష విధానం.
దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో(CBT) నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఏ కేంద్రీయి విద్యాలయ సంస్థలోనైనా పని చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉండగా.. 25 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఆగ్రా, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, ఛండీఘడ్, చెన్నై, డెహ్రడూన్, ఎర్నాకులం, గుర్గాన్, గౌహతి, హైదరాబాద్ , జబల్ పూర్, జైపూర్, జమ్ము, కోల్ కత్తా, లక్నో, ముంబయ్, పాట్నా, రాయ్ పూర్, రాంచీ, సిల్చార్, టిన్ సుకియా, వారణాసి ఉన్నాయి. అంతే కాకుండా.. 1252 సెంటర్స్ ఉన్నాయి. విదేశాల్లో మరో 3 సెంటర్లను ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థ కలిగి ఉంది. వీటితో పాటు.. 5 జోనల్ ఇనిస్టిట్యూట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు డిసెంబర్ 3-9 మధ్య విడుదలయిన ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్లో పేర్కొన్నారు.
WEBSITE : https://kvsangathan.nic.in/
0 Response to "KVS Recruitment 2022"
Post a Comment