AP Police Recruitment
AP Police Jobs: గుడ్ న్యూస్ . ఏపీలో 6511 పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో 6,511 పోలీస్ (AP Police Recruitment) ఉద్యోగాల భర్తీకి ఇటీవల సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులను కూడా ఆదేశించారు. తాజాగా ఏపీలో ఖాళీగా ఉన్న ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6511 ఖాళీలను భర్తీ చేయనున్నారు. .
పోస్టుల వివరాలు
- 1. సివిల్ ఎస్సై పోస్టులు - 387, 2.ఏపీఎస్పీ ఎస్సై పోస్టులు - 96,
- 3. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు - 3508, 4.ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2520, 5.ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 2520 ఖాళీగా ఉన్నాయి.
3. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 ఖాళీలను భర్తీ చేస్తోంది ఏపీపీఎస్‌సీ. అందులో డిప్యూటీ కలెక్టర్- 10, అసిస్టెంట్ కమిషనర్- 12, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్- 13, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్- 2, డివిజనల్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్- 2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్- 8 పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు డిసెంబర్ నెల నాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి.. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులను నిర్వహించనున్నారు.
ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి. గత నోటిఫికేషన్‌లో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ రెండేళ్లు పూర్తి చేసుకుంటే కానిస్టేబుల్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాజా నియా మకాల విషయంలో ఈ వెసులుబాటుపై నోటిఫికేషన్‌లో స్పష్టత లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే APPSC నుంచి పలు జాబ్ నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు
0 Response to "AP Police Recruitment"
Post a Comment