RRC WCR Apprentice Recruitment 2022-23
RRC-West Central Railway Recruitment:రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 2521
డివిజన్‌ల వారీగా ఖాళీలు.
- 1. జబల్పూర్ డివిజన్: 884 పోస్టులు
- 2. భోపాల్ డివిజన్: 614 పోస్టులు
- 3. కోట డివిజన్: 685 పోస్టులు
- 4. కోట వర్క్‌షాప్ డివిజన్: 160 పోస్టులు
- 5. సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్(CRWS BPL) డివిజన్: 158 పోస్టులు
- 6. హెచ్‌క్యూ/ జబల్‌పూర్ డివిజన్: 20 పోస్టులు
అర్హత:అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి:17.11.2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తుల సమర్పణ, ప్రింటింగ్ తీసుకునే సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08125930726 ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఈమెయిల్: rrc.jblpr2022@gmail.com
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ఈ-వాలెట్లు & మొదలైన వాటి ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 18.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17.12.2022.
0 Response to "RRC WCR Apprentice Recruitment 2022-23"
Post a Comment