Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These three will rule the world in the future! The unmasked Microsoft CEO

 భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించేది ఈ మూడే ! గుట్టు విప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో

These three will rule the world in the future!  The unmasked Microsoft CEO

టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, హైదరాబాద్‌ టెక్ హీరో సత్య నాదెళ్ల రెండు రోజుల ఇండియా పర్యటనలో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తను రాసిన హిట్ రీఫ్రెష్ పుస్తక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరిపిన విషయం విదితమే. గతేడాది సెప్టెంబర్‌ 26న ఇంగ్లిష్‌ విడుదలైన ఈ పుస్తకం ధర రూ.599. నాదెళ్ల 'హిట్‌ రీఫ్రెష్‌' పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతరత్రా అనుభవాలను రాశారు.

మిక్స్‌డ్‌ రియాలిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రానున్న సంవత్సరాల్లో ప్రపంచ రూపు రేఖలను మార్చే టెక్నాలజీలుగా మారుతాయని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అభివర్ణించారు.

మిక్స్‌డ్‌ రియాలిటీని హైబ్రిడ్‌ రియాలిటీగా కూడా చెబుతారని, రియల్, వర్చువల్‌ టెక్నాలజీల కలబోత ఇదని, కంప్యూటింగ్‌ ఇప్పటి వరకు మనిషి ఆధారితంగానే మెరుగుపడగా, అంతిమంగా కంప్యూటింగ్‌ అనుభవం మిక్స్‌డ్‌ రియాలిటీగానే ఉండబోతుందన్నారు సత్య నాదెళ్ల.

ఈ సంధర్భంగా మైక్రోసాఫ్ట్‌ హోలోలెన్స్‌ గురించి మాట్లాడుతూ విద్యతో పాటు చాలా రంగాల్లో హోలోలెన్స్‌ను వినియోగిస్తున్నారని, హోలోలెన్స్‌ సాయంతో యూజర్లు వర్చువల్‌ రియాలిటీ భావన పొందుతారని తెలిపారు.

43 ఏళ్ల ప్రయాణంలో మైక్రోసాఫ్ట్‌ ప్రతి ఐదేళ్లకోసారి అస్తిత్వ ముప్పును ఎదుర్కోవడం నేను చూశా. ఏదో ఒక కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ముగింపు పలుకుతుందని కొంత మంది అన్నారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్‌ తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది'' అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేతో నాదెళ్ల కాసేపు సరదాగా గడిపారు. 1960ల నాటి ఆటగాడైన జయసింహ తనకెంతో ఇష్టమైన క్రికెటర్ అని సత్య తెలిపారు.

తను రాసిన హిట్ రిఫ్రెష్ పుస్తకంలో సత్య నాదెళ్ల జయసింహ గురించి ప్రస్తావించారు. చిన్నపిల్లాడిలా కనిపించే ఈ హైదరాబాదీ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అతడి స్టయిల్ నాకెంతో నచ్చుతుందన్నారు.

కాగా రైడింగ్, క్యాబ్ సేవల యాప్ ఓలా.. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో జట్టు కట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కార్ల తయారీదారుల కోసం ఓ నూతన వాహన వేదిక నిర్మాణానికి వీలుగా మైక్రోసాఫ్ట్‌తో ఓలా అంతర్జాతీయ భాగస్వామ్యానికి తెరతీసింది.

ఈ ఒప్పందంలో భాగంగా మరింత ఉన్నతమైన రైడర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను, ఏఐ, ఉత్పాదక పనిముట్లను ఓలా వినియోగించుకోనుంది. తమ రెండు సంస్థల కలయిక ప్రపంచ వాహన వ్యవస్థ అనుసంధానానికి, ముఖ్యంగా కార్ల తయారీ కంపెనీల అభివృద్ధికి దోహదపడగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఓలా వ్యక్తం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These three will rule the world in the future! The unmasked Microsoft CEO"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0