Western Coal Field Limited Jobs
New Jobs : నిరుద్యోగులకు అలర్ట్ .1010 పోస్టులకు సీఎం గ్రీన్ సిగ్నల్.
Western Coal Field Limited Jobs: వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో ఉద్యోగాలు.. 900 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
New Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే సంక్షేమ అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ(Andhra Pradesh) నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే సంక్షేమ అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్(CM Jagan) మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి వివరాలను అధికారులు సమీక్షలో వివరించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా.. సంక్షేమ హాస్టళ్లకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. నాడు నేడు కార్యక్రమంపై సమగ్ర కార్యాచరణ ఉండాలన్నారు
సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశించారు. ఇక సంక్షేమ హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిలో భాగంగానే 759 సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అంతే కాకుండా.. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు.. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ -4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలా మొత్తం 1010 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు
పోలీస్ ఉద్యోగాలు.
ఇటీవల రాష్ట్రంలో 6,511 పోలీస్ (Police) ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది. ఇటీవల దీనికి సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీకాకుళంలో పర్యటనలో భాగంగా.. ఏపీ పోలీసు శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటన చేశారు.
రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందన్నారు. మరోవైపు డీజీపీ ప్రకటనతో నిరుద్యోగులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి నుంచే పరీక్షల కోసం, అటు గ్రౌండ్ ప్రాక్టీస్ కోసం సంసిద్ధం అవుతున్నారు.
0 Response to "Western Coal Field Limited Jobs"
Post a Comment