Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

1. New rules come into effect when a new month begins.

 1. కొత్త నెల ప్రారంభం కాగానే కొత్త రూల్స్ (New Rules) అమలులోకి వస్తుంటాయి.

1. New rules come into effect when a new month begins.

ఈసారి కొత్త నెల మాత్రమే కాదు, కొత్త సంవత్సరం కూడా ప్రారంభం కానుంది. జనవరిలో అమలులోకి రాబోయే కొత్త రూల్స్ చాలానే ఉన్నాయి. వీటిలో సామాన్యుల డబ్బుపై ప్రభావం చూపే నియమనిబంధనలు కూడా ఉన్నాయి.

2. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (Credit Card) హోల్డర్లకు, ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అంతేకాదు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price) కూడా మారే అవకాశం ఉంది. మరి ఆ రూల్స్ ఏంటీ, మీరు ఏం తెలుసుకోవాలి? ఏం గుర్తుంచుకోవాలి? తెలుసుకోండి.

3. Smartphone: దొంగిలించిన, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేస్తోంది. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ తయారుచేసే కంపెనీలన్నీ, ఆ హ్యాండ్‌సెట్స్ అమ్మడానికన్నా ముందే ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైజ్ రిస్ట్రిక్షన్ పోర్టల్ https://icdr.ceir.gov.in లో రిజిస్టర్ చేయాలి. 2023 జనవరి 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి.

4. SBI Home Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ ఆఫర్స్ ప్రకటించింది. వడ్డీ రేటులో భారీగా తగ్గింపు ప్రకటించింది. అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మినహాయించింది. ఎస్‌బీఐ కస్టమర్లు 2023 జనవరి 31 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐలో గృహ రుణాలు 8.75 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆఫర్‌లో భాగంగా వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్ డిస్కౌంట్ ప్రకటించింది ఎస్బీఐ. 2023 జనవరి 31 వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చు.

5. Car Prices: జనవరిలో కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఆడి, మెర్సిడెస్-బెంజ్, హోండా, మహీంద్రా వంటి కంపెనీలన్నీ తమ బ్రాండ్ కార్ల ధరల్ని పెంచబోతున్నట్టు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరలు పెరగడం వంటి కారణాలతో ఇన్‌ఫుట్ ఖర్చులు పెరిగాయని, కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నామని కంపెనీలు ప్రకటించాయి.

6. SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ స్పెండింగ్ మైల్‌స్టోన్స్ దాటినవారికి ఇచ్చే క్లియర్‌ట్రిప్ ఓచర్లను ఒకే ట్రాన్సాక్షన్‌లో రీడీమ్ చేయాలని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. ఒక వోచర్ లేదా ఆఫర్‌ను మరో వోచర్, ఆఫర్‌తో కలిపే అవకాశం ఉండదు. ఈ రూల్ జనవరి 6 నుంచి అమలులోకి రానుంది. ఇక అమెజాన్‌లో సింప్లీ క్లిక్ లేదా సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డుతో లావాదేవీలు చేస్తే 10 రెట్లు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్‌ని 5 రెట్లకు తగ్గించింది ఎస్‌బీఐ కార్డ్. 2023 జనవరి 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి.

7. Bank Locker: జనవరి 1 నుంచి బ్యాంక్ లాకర్ రూల్స్ మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పటికే లాకర్ సదుపాయం ఉపయోగిస్తున్న కస్టమర్లతో బ్యాంకులు లాకర్ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ పేపర్లు అటు కస్టమర్ల దగ్గర, ఇటు బ్యాంక్ దగ్గర ఉంటాయి. బ్యాంక్‌లో ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయో, ఏ ఏ లాకర్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయో కూడా కస్టమర్లకు తెలియజేయాల్సి బ్యాంకులు ఉంటుంది.

8. LPG Gas Cylinder Price: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడంపై నిర్ణయం తీసుకుంటాయి. మరి కొత్త ఏడాది మొదటి రోజున గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి.

9. WhatsApp: కొత్త సంవత్సరంలో పాత స్మార్ట్‌ఫోన్లలో ఇక వాట్సప్ పనిచేయదు. యాపిల్, సాంసంగ్, ఎల్‌జీ, హువావే లాంటి బ్రాండ్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తం 49 స్మార్ట్‌ఫోన్ల జాబితాను వాట్సప్ రిలీజ్ చేసింది. పాత స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్నవారు వాట్సప్ ఉపయోగించలేరు. వాట్సప్ వాడాలంటే కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాల్లిందే

10. NPS: కొత్త ఏడాదిలో ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్‌ కాంట్రిబ్యూషన్‌లను సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో పార్షియల్‌గా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు. నాన్‌ గవర్నమెంట్‌ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సబ్‌స్క్రైబర్‌లు సెల్ప్‌- డిక్లరేషన్ ద్వారా NPS నుంచి ఆన్‌లైన్‌లో పార్షియల్‌గా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం 2023 జనవరి 1 నుంచి నిలిచిపోతుంది.

11. HDFC Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లకు జనవరి 1 నుంచి కొత్త మార్పులు అమలులోకి రాబోతున్నాయి. రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌ను రివైజ్ చేసింది. అంతేకాకుండా సెలక్టెడ్‌ నంబర్‌ రివార్డ్‌ పాయింట్స్‌పై ఫీజు స్ట్రక్చర్ కూడా మార్చింది. అన్ని కార్డ్‌లను ఫ్లైట్‌ అండ్ హోటల్ రిజర్వేషన్స్, తనిష్క్ వోచర్స్, నిర్దిష్ట ప్రొడక్ట్- వోచర్స్‌కు సంబంధించి పేమెంట్ చేసే సందర్భంలో రెడిమ్‌ చేసే అవకాశం ఉండదు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "1. New rules come into effect when a new month begins."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0