AP Job mela
Job Mela : ఏపీలో ఈరోజు భారీ జాబ్ మేళా . ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఇలా రిజిస్టర్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంగా మారింది. ఈ నెల 23న మరో భారీ జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం ఉంటుంది. రూ.2 వేల అటెండెన్స్ బోనస్ సైతం చెల్లించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
Amara Raja Group: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రూ.12 వేల వేతనంతో పాటు ఫుడ్, ఇతర వసతి సదుపాయం ఉంటుంది. చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది.
Apollo Pharmacy: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ/ఎం/డీ ఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.
Max Security Services: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ గార్డ్స్, సెక్యూరిటీ సూపర్ వైజర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు ఏలూరు , కొవ్వూరు, రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ZP High School, Buttayagudem, Eluruలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇతర వివరాలకు 9182342688, 8639980807 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 Response to "AP Job mela"
Post a Comment