Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Police Recruitment

 పోలీసు కొలువుల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూసే అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6511 పోస్టులతో ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

AP Police Recruitment

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

AP కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు

CLICK HERE FOR RESULT

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

దీంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసు ఉద్యోగాలకు సిద్ధం కావడమే తరువాయి.. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ పూర్తి వివరాలతో పాటు అర్హతలు, ఫిజికల్ టెస్ట్, దరఖాస్తు ప్రక్రియ, సిలబస్ వంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.

విద్యార్హతలు: ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థి విషయంలో, అభ్యర్థులు తప్పనిసరిగా ఎస్ఎస్‌సీ లేదా దాని తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ చదివి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఉండాలి.

వయోపరిమితి: కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఏపీ లేదా ఏపీ నివాస రుజువు ఉన్న దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 నుంచి 32 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. నాన్ లోకల్ అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఏపీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ:

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌రిక్రూట్ మెంట్ కోసం నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఫలితాలు, హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కానిస్టేబుల్ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది.

1. ప్రిలిమినరీ పరీక్ష

2. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్

3. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులవుతారు.

ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.

చివరగా, ఈ ఫిజికల్ టెస్ట్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హత సాధిస్తారు.

మెయిన్ పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి.

పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష విధానం:

ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్‌సీ/ఎస్టీ/ఈఎస్ఎంలకు 30 శాతం అర్హత మార్కులు ఉంటాయి. పరీక్షను ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషల్లో నిర్వహిస్తారు.

పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ సిలబస్:

ఇంగ్లీష్

అంకగణితం (ఎస్ఎస్‌సీ స్టాండర్డ్)

రీజనింగ్ పరీక్ష

మానసిక సామర్థ్యం

జనరల్ సైన్స్

భారతదేశ చరిత్ర

భారతీయ సంస్కృతి

భారత జాతీయ ఉద్యమం

భారతీయ భూగోళశాస్త్రం

రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ

జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్:

ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ 2022కి అర్హులు అవుతారు. అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా నిర్ధిష్టమైన శారీరక కొలతలు కలిగి ఉండాలి.

ఫిజికల్ మెజర్‌మెంట్స్

పురుషులు: ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.

ఛాతి కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.

స్త్రీలు: ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.

బరువు 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.

గమనిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలు, ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు కింది కొలతలు కలిగి ఉండాలి.

1. పురుషులు: ఎత్తు - 160 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు

ఛాతి- కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.

2. స్త్రీలు: ఎత్తు - 150 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.

బరువు- 38 కిలోల కంటే తక్కువ ఉండరాదు.

భౌతిక సామర్థ్య పరీక్ష:

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడిన తర్వాత, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు.. ఫిజికల్ టెస్ట్ కు హాజరు కావాలి.

అర్హత సమయం/దూరం  జనరల్         Exసర్వీస్‌మెన్

    

            ఉమెన్

100 మీ పరుగు

15 సెకండ్స్

16.5 సెకండ్స్

18 సెకండ్స్

లాంగ్ జంప్

3.80 మీ

3.65 మీ

2.75 మీ

1600 మీటర్లు

8 ని.

9 ని. 30 సెకన్లు

10ని. 30 సెకండ్స్

చివరి పరీక్ష మెయిన్స్:

చివరి పరీక్ష ఆబ్జెక్టివ్ పరీక్ష- పేపర్‌లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. సమయం 3 గంటలు ఉంటుంది. చివరగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా జాబితా రూపొందిస్తారు.

గమనిక: సివిల్ కానిస్టేబుల్‌లకు పురుషులు, మహిళలు అర్హులు, కాని ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు కేవలనం పురుషులు మాత్రమే అర్హులు.

ఎస్ఐ అభ్యర్థులు:

దరఖాస్తు ప్రారంభ తేదీ:  14.12.2022.

 దరఖాస్తు కు చివరి తేదీ:18.01.2023

ప్రిలిమినరీ పరీక్ష తేదీ:  19.02.2023.

కానిస్టేబుల్ అభ్యర్థులు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 30, 2022

చివరి తేదీ: డిసెంబర్ 28, 2022.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 22, 2023

వెబ్‌సైట్: https://slprb.ap.gov.in

NOTIFICATION

WEBSITE  : https://slprb.ap.gov.in/



DOWNLOAD HALL TICKETS FOR SCT PC (CIVIL AND APSP)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Police Recruitment"

Post a Comment