Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ARUNAACHALA DEEPA DARSHSNAM

 అరుణాచల మహా దీపం వెలిగించే ప్రక్రియ

అరుణాచల దీప దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం

ARUNAACHALA DEEPA DARSHSNAM

వీటిని అందరమూ అక్కడకు వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు, కనీసం ఇలా చిత్రాలలో దర్శించి, వాటి వివరాలు తెలుసుకున్నా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

ఓమ్ శ్రీఅరుణాచలేశ్వరాయనమః

పాపాన్నే కాదు...పుణ్యాన్ని కూడా

దర్శనం చేత మాత్రమే దహించి వేసి

ముక్తినిచ్చే అద్భుతమైన "అరుణాచల జ్యోతి"

ఈరోజు మంగళ వారం 6.12.2022 ,సాయంత్రం ఆరు గంటలకు కృత్తిక నక్షత్రమున అరుణాగిరి పై భక్తులు ఇచ్చిన నెయ్యి, వత్తులు వేసి వెలిగిస్తారు. ఈ మహ దీపం 11రోజుల పాటు నిరంతరాయంగా వెలుగుతుంటుంది. ప్రతి రోజు సాయంత్రం వత్తులు,నెయ్యి పోసి వెలిగిస్తారు.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

ఇది తమిళులకు కార్తీక మాసము, కార్తీక మాసములో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే " కృత్తికా దీపోత్సవం " అంటారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని " జ్యోతి నాడార్ లేక దీప నాడార్ " అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. షుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపము దర్శనమిస్తుంది.

అగ్ని రూపం నిశ్చల దీపం

గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

ఏమిటీ అరుణాచలం.

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ.

అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.

మహా దీపం

అగ్ని రూపం నిశ్చల దీపం

అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం. ‘నమఃశివాయ’ అనేది యోగ పంచాక్షరి. ‘అరుణాచలం’ జ్ఞానపంచాక్షరి. ‘శ్రీరమణులు’ ధ్యాన పంచాక్షరి. అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు.. నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు.

రమణ సందేశం

తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే.. అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం.. ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.

అరుణాచల కార్తీకదీపం🌹🙏


 అరుణాచలంలో ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో..

 భరణి...నక్షత్రంలో అరుణాచలేశ్వరుని ప్రధానాలయంలో

 భరణి దీపం వెలిగిస్తున్న ఆలయ అర్చక స్వాములు  🌹🙏


 గిరి ప్రదక్షిణ ఫలితాలను పెంపు


తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?

ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం. ఎందుకంటే పరీక్షలు రాసినవారందరికీ ఒకే విధమైన మార్కులు రావు కదా. వారి వారి జ్ఞాపకశక్తి, సమాధానాలు రాసే పద్ధతి, పదజాలం వంటి పలు విషయాల వల్లే మార్కులు అధికంగా లభిస్తాయి. అదే రీతిలో తిరుఅణ్ణామలైని పలువురు గిరి ప్రదక్షిణ చేసినా వారి వారి ఆత్మవిశ్వాసం, అంకితభావంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందగలుగుతారు.

అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చును. 

1. స్నానమాచరించిన తర్వాత తమ కులధర్మాన్ని బట్టి నుదుట విభూతి, సింధూరం, కుంకుమ ధరించి, దేహంపై దైవీక చిహ్నాలతో గిరి ప్రదక్షిణ చేస్తే శుభఫలితాలు అధికమవుతాయి.

2. సంప్రదాయ రీతిలో పురుషులు పంచకచకం, స్త్రీలు చీరలు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం.

3. ఆయా రోజులకు అనువైన రంగుల దుస్తులు ధరిస్తే మంచిది.

4. పురుషులు జంధ్యాలు, చెవిపోగులు ధరించి, మహిళలు ముక్కుపుడకలు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.

5. నిర్ణీత లగ్నం, హోరై, అమృతయోగం వంటి శుభముహూర్త సమయాల్లో గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.

గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడా పితృదేవతలకు తర్పణాలు, ధాన ధర్మాలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికంగా పొందగలుగుతారు.

తిరుఅణ్ణామలైని ఒంటరిగా గిరి ప్రదక్షిణం చేయడం కంటే కుటుంబ సమేతంగా, బంధువులు, స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్ట ప్రదం. ప్రతీ సారి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తమతో పాటు ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం కూడా మంచిది.

గిరి ప్రదక్షిణ నియమాలు

సాక్షాత్తు మహేశ్వరుడే స్థూల రూపంలో అవతరించిన తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ చేయడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేమిటంటే.

1. పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ నియమానికి మినహాయింపులు లేనేలేవు.

తిరుఅణ్ణామలై అంతటా కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు సూక్ష్మరూపంలో ఉన్నాయి. కనుక అంతటి పవిత్రమైన మార్గంలో ఎట్టి పరిస్థితులలోనూ పాద రక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది.

2. వాహనాలతో గిరి ప్రదక్షిణ చేయరాదు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమ శక్త్యానుసారం నెమ్మదిగా నడిచి అక్కడక్కడా సేదతీరుతూ, విశ్రాంతి తీసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. నడవలేని స్థితిలో ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్న చోటు నుండే సాష్టాంగంగా నమస్కరిస్తే చాలును.

3. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కబుర్లాడరాదు. భగవన్నామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. వ్యర్థ ప్రసంగాలు చేయరాదు. సంస్కృతం, తెలుగు భాషలలోని దైవనామాలను నినదిస్తూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. 'అరుణాచల శివా! అరుణాచల శివా!' అనే నామావళిని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.

4. మొక్కుబడులు తీర్చుకోదలచినవారు మాత్రమే తిరుఅణ్ణామలై శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. కార్తీక దీపం రోజున పర్వతంపైకెక్కి నేతితో ప్రార్థన చేసి వెంటనే కిందకు దిగాలి. కొండపై నుండి వేడుకగా చూడకూడదు. మొక్కుబడులు లేనివారు అకారణంగా కొండెక్కరాదు. పాప చింతనలు కలిగిన వారు పర్వతం పైకి ఎక్కరాదు.

5. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న తీర్థాలు, నందులు, అష్టలింగాలు, ముఖ్యమైన దర్శన ప్రాంతాల వద్ద సాష్టాంగ నమస్కారాలు ఆచరించాలి. వంటిపై మట్టి అంటుకుంటుందన్న తలంపు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు. సిద్ధులు, మహర్షులు పాదాలు మోపిన పవిత్ర స్థలమన్న భావనతోనే సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

6. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎదరుయ్యే నిరుపేదలకు, పశువులు, శునకాలు వంటి జంతువులకు ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ముందుగానే వారి వెంట పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు (bread), తదితర ఆహార పొట్లాలను తీసుకెళ్లడం మంచిది.

కార్యసిద్ధి కోసం గిరిప్రదక్షిణ

ఒక్కో రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ఆ రోజుకు సంబంధించి ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుని ఆ వర్ణపు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేసి మరిన్ని ఫలితాలను పొందవచ్చు. ఆయారోజులకు అనువైన వర్ణాలు కలిగిన దుస్తులను నిరుపేదలకు దానం చేస్తే మరీ మంచిది.

వారం ధరించాల్సిన వస్త్రపు వర్ణం

ఆదివారం నారింజరంగు

సోమవారం తెలుపు + ఎరుపు

మంగళవారం ఎరుపు

బుధవారం పచ్చ

గురువారం పసుపు

శుక్రవారం లేత నీలం

శనివారం నలుపు లేదా నీలం

మనం చేయదలచిన సత్కార్యాలకు ఆటంకాలు కలిగితే పైన పేర్కొన్న విధంగా ఆయారోజులకు అనువైన రంగు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే ఆటంకాలు తొలగి సత్కార్యాలను నిర్విఘ్నంగా చేయగలుగుతారు.

సకలమూ తెలిసినవారే సద్గురువులు

తిరుఅణ్ణామలై క్షేత్రాన్ని వారాలలో గిరి ప్రదక్షిణ చేసే పద్ధతులను తెలుసుకున్నాం. ఏయే వారాల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో కూడా తెలుసుకున్నాం.

ఇక సామాన్యమైన మానవులుగా ఉండే మనం ఎలా ఈ దర్శనాలను, ఆ దర్శనపు ఫలితాలను ఎలా తెలుసుకోగలం? అలా తెలుసుకున్నా వాటిని జ్ఞాపకంలో పెట్టుకోగలమా? సద్గురువు సలహాలు పొందాలన్నదే ఈ ప్రశ్నకు అనువైన సమాధానమవుతుంది.

ఇక పైన పేర్కొన్న దర్శనాలే గాకుండా మరెన్నో దర్శనాలు కూడా ఉన్నాయి. సోమస్కంధ దర్శనం, గజతోన్ముఖ దర్శనం, కామాక్యా రూప దర్శనం, 'అన్నిమతాలు ఒక్కటే' అని రుజువుచేసే సంగమ దర్శనం, మూషిక లింగ దర్శనం, హరిహర దర్శనం అంటూ ఎన్నో దర్శనాలను గురించి చెప్పుకుంటూ పోవచ్చు. ఈ దర్శనాలకు సంబంధించి నియమనిష్టలు, పద్ధతులు గురించి బాగా తెలిసినవారే సద్గురువులు.

సద్గురువు నిర్దేశించిన మార్గంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఆ గురువులే మనకు అనువైన దర్శనాలను నిర్దేశించి దైవానుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తారు. మన పూర్వజన్మ కర్మఫలితాలను పోగొట్టి సద్గతిని కలిగిస్తారు. కనుకనే సద్గురువుతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తే మరీ మంచిది.

ఇక మంచి గురువును పొందలేనివారు 'మహేశ్వరా మాకు అనువైన సద్గురువును అందించు స్వామీ' అని ప్రార్థిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తే ఆ పరమేశ్వరుడే కరుణించి సద్గురువును మనకు అందిస్తాడు.

అలా సద్గురువుల అనుగ్రహం పొందిన మీదట మనం గుర్తుంచుకోవాల్సిన ఉన్నతమైన మంత్రమొకటింది. 'మహేశ్వరా నాదంటూ ఏవీలేవు. సర్వమూ నీదే! కరుణామయా కరుణించవయా అరుణాచలేశ్వరా' అని మనసారా ప్రార్థిస్తే చాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సకలమూ తెలిసిన సద్గురువు ద్వారానే ఇవన్నీ పొందగలం. సద్గురువును శరణుజొచ్చి సకల సౌఖ్యాలు పొందుదామా! 

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

కార్తిగై బ్రహ్మోత్సవం /  అరుణాచలంలో కార్తీక దీపం

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు...

అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది...

ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో (నవంబరు నుండి డిసెంబరు ) 10 రోజులపాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.  

కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది!!...

పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు, అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది,  (తమిళ టి.వి. ఛానల్స్ లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.)

ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్రలో వేయి కిలోల స్వఛ్ఛమైన నేతిని పోసి, 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు.

ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి, ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది,

అరుణాచల ఆలయ ప్రస్తావనలో చెప్పుకోదగిన విశిష్టత కలిగినది, ఈ కార్తీక దీపాన్ని పది రోజుల పండుగగా జరుపుకుంటారు మరియు దీనిని కార్తిగై బ్రహ్మోత్సవం అని పిలుస్తారు.

తిరువణ్ణామలై కార్తిగై దీపం పండుగ  - 10 రోజులు..నిర్వహిస్తారు..

మొదటి రోజు - కార్తిగై దీపం పండుగ

ధ్వజారోహణం అని కూడా పిలువబడే పండుగ ప్రారంభాన్ని సూచిస్తూ ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. 

ఉదయం, రాత్రి అరుణాచలేశ్వర స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. 

ఊరేగింపులో పంచమూర్తులు (పంచమూర్తులు) కూడా బయటకు తీసుకువెళతారు...

పంచమూర్తిగళ్లో గణపతి, మురుగన్, సందీశ్వరుడు, అరుణాచలేశ్వరుడు మరియు పార్వతి అమ్మవారు ఉన్నారు.

కల్యాణ మండపం వద్ద దీపారాధన చేసిన తర్వాత ఈ ఊరేగింపులు వేర్వేరు వాహనాలపై నిర్వహిస్తారు.

రెండవ రోజు 

ఇందిరావిమానంపై భగవంతుడు పంచమూర్తిగారి ఇందిర రథంపై రావడంతో కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతుంది

మూడవ రోజు

రాత్రి సింహవాహనంపై సింహవాహనంపై గంభీరంగా ఊరేగింపుగా స్వామి పంచమూర్తిలతో ప్రారంభమవుతుంది...

నాల్గవ రోజు 

కార్తీక దీపం రాత్రి కామధేను వాహనంపై ప్రారంభమయ్యే ఊరేగింపులో స్వామి పంచమూర్తిలు వస్తారు...

మంగళకరమైన వృక్షం కర్పవిరుక్షం కూడా స్వామివారి వైపు ఉంటుంది. 

ఈ వృక్షం భక్తులు కోరుకునే అన్ని కోరికలను తప్పకుండా తీరుస్తుందని నమ్మకం

ఐదవ రోజు 

వెండి ఋషభ వాహనంపై ఈ ఊరేగింపు చాలా ఆకర్షణీయంగా మరియు సాక్ష్యాధారంగా ఉంటుంది.

దాదాపు 25 అడుగుల ఎత్తున్న ఈ వాహనంపై పంచమూర్తిగాళ్ వెళతాడు...

17 అడుగుల వ్యాసం కలిగిన పెద్ద గొడుగును ఊరేగింపులో తీసుకువెళతారు.

ఆరవ రోజు 

వెండి రథంపై రాత్రి ఊరేగింపుతో ప్రారంభమవుతుంది, ఇది ఆలయం చుట్టూ వచ్చినప్పుడు అందంగా రూపొందించబడింది. 

ఏడవ రోజు 

రథంపై  ఊరేగింపుతో మొదలవుతుంది, అది చాలా పెద్దది మరియు ఇది దాదాపు రహదారి పూర్తి వెడల్పును ఆక్రమించింది. 

ఈ రథం బలమైన మరియు కఠినమైన స్వచ్ఛమైన చెక్కతో తయారు చేయబడింది.

ఎనిమిది రోజు  

భారీ గుర్రపు వాహనంపై ఊరేగింపుగా బయలుదేరడంతో కార్తీక దీపం పండుగ రాత్రి ప్రారంభమవుతుంది. 

ఈ గుర్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ గుర్రం యొక్క నాలుగు కాళ్ళు గాలిలో ఉంటాయి మరియు అవి నేలను తాకవు. 

తొమ్మిదవ రోజున 

భక్తులు స్వామివారు కైలాస వాహనంపై ఊరేగింపును వీక్షించవచ్చు. 

ఈ వేడుక ఎక్కువగా తొమ్మిదవ రాత్రి నిర్వహిస్తారు. 

పదవ రోజు - కార్తిగై దీపం

పండుగ తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు. 

సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కొండపై మహాదీపం వెలిగిస్తారు...

తిరువణ్ణామలైలో కార్తిగై దీపం పండుగ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన వేడుక.

అరుణాచలేశ్వరుడు కొండపైన అగ్ని రూపంలో కనిపిస్తాడని చెబుతారు. 

ఈ మహిమాన్వితమైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని చూసేందుకు ఆ రోజున అరుణాచలేశ్వర ఆలయంలో చాలా కనులు పండుగలగా కోనసాగుతుంది...


స్వస్తి  శుభమస్తు


     సమస్త లోకా సుఖినోభవంతు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ARUNAACHALA DEEPA DARSHSNAM"

Post a Comment