Data Entry Jobs
Data Entry Jobs : ఏపీ పంచాయితీ రాజ్ శాఖలో డేటా ఎంట్రీ పోస్టులు .. ఎలా ఎంపిక చేస్తారో వివరాలు.
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయితీ రాజ్ శాఖ ఏలూరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 22 మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్(సీఎస్ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఎంపికైనl అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేష్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు 20-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
0 Response to "Data Entry Jobs"
Post a Comment