Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you sit and work for 10 hours? But these things can be known.

 10 గంటలు కూర్చుని జాబ్ చేస్తున్నారా . అయితే ఈ విషయాలు తెలుసుకోగలరు.

Do you sit and work for 10 hours?  But these things can be known.

మన పూర్వికుల్లో కొందరికి ఆసుపత్రులు ఉంటాయని.. వాటికి వెళ్లి చికిత్స చేయించుకోవడం కూడా తెలియదు. చాలా మందికి పెరిగి పెద్ద అయ్యే వరకు ఇంజక్షన్స్ అంటే తెలియదు. ఇప్పుడు మనం ఏడాదికి ఒక సారి అయినా ఆసుపత్రికి వెళ్తున్నాం. ఈ మద్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకప్పుడు ఉన్న జీవన విధానంకు ఇప్పుడు జీవన విధానంకు చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో ఎక్కడికి అయినా వెళ్లాలి అంటే కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారు.. లేదంటే సైకిల్‌ పై వెళ్లే వారు. 

ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అనుకున్నా సొంత బైక్‌ లేదా కారు ఉంటుంది. కనుక ఇంటి బయట కాలు పెడితే వెంటనే వాహనంలో పెట్టడమే. మనిషి ప్రతి రోజు వయసుకు తగ్గట్లుగా నడవక పోతే అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇక ఈమద్య కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్‌ మరియు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బ్యాక్‌ పెయిన్‌ కు అందరికి తెలిసిన కారణం ఎక్కువ సమయం కూర్చుని ఉండటమే. గంటలకు గంటలు కూర్చుని ఉండటం వల్ల సమస్యలు మొదలు అవుతాయి. గంటలో 5 నుండి 10 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడంతో పాటు చేతులను కిందికి మీదకు అంటూ ఉండాలి. 

పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలకు కారణం అయిన కంటిన్యూస్‌ సిట్టింగ్‌ గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లు మరియు చేతులు ముడచుకుని కూర్చుని ఉండటం వల్ల రక్త ప్రసరణ ఎక్కడికి అక్కడ స్థంభించి పోతుంది. తద్వార గుండె సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక కూర్చుని జాబ్‌ చేసే వారు
ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో లేచి నిలబడి కాళ్లు మరియు చేతులు మూమెంట్స్ ఇవ్వాల్సి. 

కొన్ని సంవత్సరాల పాటు కూర్చుని చేసే జాబ్‌ చేస్తున్న వారిలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మొదట నడుము నొప్పి అంటూ కంప్లైంట్‌ ఇచ్చే వారు ఆ తర్వాత ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు గుండె సమస్యలు అంటూ ఆసుపత్రి చుట్టు తిరగాల్సి ఉంటుంది. కనుక భవిష్యత్తులో ఆసుపత్రి చుట్టు తిరిగే అవసరం రాకుండా వర్క్‌ ప్లేస్ లో గంటకు అయిదు పది నిమిషాలు అయినా లేచి వాకింగ్ చేయాలంటున్నారు. మీరు కనుక ఎక్కువ సమయం కూర్చుని చేసే జాబ్‌ చేస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పిన విధంగా గంటకు అయిదు పది నిమిషాలు కనీసం వాకింగ్‌ చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you sit and work for 10 hours? But these things can be known."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0