FCI Admit Card
FCI Admit Card : ఎఫ్‌సీఐలో 5043 ఉద్యోగాల భర్తీ , పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్ ! అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం
- Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. -https://fci.gov.in
- Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే "Career" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- Step 3:అక్కడ "Assistant Grade 3 Admit Card 2019" లింక్ మీద క్లిక్ చేయాలి.
- Step 4: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
- Step 5:వివరాలు నమోదుచేసి "Submit" బటన్ మీద క్లిక్ చేయాలి.
- Step 6: అభ్యర్థుల అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్ష రోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాసేందుకు అనుమతిలేదు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు.
కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు:
నార్త్ జోన్-2388,
సౌత్ జోన్-989,
ఈస్ట్ జోన్-768,
వెస్ట్ జోన్-713,
నార్త్ఈస్ట్జోన్-185.
1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్): 48 పోస్టులు
2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్): 15 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 73 పోస్టులు
4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్): 948 పోస్టులు
5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్): 406 పోస్టులు
6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్): 1406 పోస్టులు
7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో): 2054 పోస్టులు
8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ): 93 పోస్టులు
జీతం:
- జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రూ.34,000 - రూ.1,03,400. ఇతర భత్యాలు అదనం.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.30,500 - రూ.88,100. ఇతర భత్యాలు అదనం.
- అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.28,200 - రూ.79,100. ఇతర భత్యాలు అదనం.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయగలరు
0 Response to "FCI Admit Card"
Post a Comment