Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

It is reported that the EC has rejected the proposal sent by Jagan Sarkar to the Center that teachers are not required for election duties.

 ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు వద్దు అని కేంద్రానికి జగన్ సర్కార్ పంపిన ప్రతిపాదననను ఈసీ తిప్పికొట్టినట్టు సమాచారం.

It is reported that the EC has rejected the proposal sent by Jagan Sarkar to the Center that teachers are not required for election duties.

ఏపీ సీఎం జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఏ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమైనా ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మారుతుందని అధికార పార్టీకి సంబంధించిన వారంతా అనుకున్నారు, అయితే అంతా అనుకున్నట్టు జరిగితే ఇబ్బంది ఉండేది కాదు, కానీ అలా జరగలేదు రివర్స్ అయ్యింది, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తిప్పికొట్టిందని సమాచారం

ఇంతకీ విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లలో కూర్చుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు కొన్ని దశాబ్దాలుగా టీచర్ల సేవలను వినియోగిస్తున్నారు, అదే సమయంలో ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను కూడా వాడుకుంటున్నారు, వీరికి ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం రోజుకి ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రూ.1500 వేతనంగాను రూ.400 ఇతర అలవెన్సులుగాను ఇస్తున్నారు

అయితే తమకు ఎన్నికల విధులు వద్దని కొన్నాళ్లుగా ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు, కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఆయా విధులు నిర్వహించేందుకు అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్న వారు కావాలి పైగా చదువుకున్న వారే అవసరం కాబట్టి, అప్పటికప్పుడు ఇంత మందిని సమకూర్చడం అంటే ఏ ప్రభుత్వానికి సాధ్యంకాదు, అందుకే వారు వద్దన్నా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయులనే ఈ విధులకు కేటాయిస్తున్నారు

ఇక ఏపీలో ఇటీవల జగన్ ప్రభుత్వం వీరిని ఆ ఎన్నికల విధుల నుంచి తప్పించింది, ప్రభుత్వంపై ఉపాద్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఈ క్రమంలో వారికి ఎన్నికలవిధులు అప్పగిస్తే తమ పుట్టి ముంచుతారని భావించిన వైసీపీ సర్కారు, వారి డిమాండ్ నే అడ్డు పెట్టుకుని, స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా పక్కన పెట్టింది, ఇదే నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది

అయితే అక్కడి అధికారులు మాత్రం అలా చెయ్యడం అస్సలు కుదరదని, ఉపాధ్యాయుల సేవలను భర్తీ చేయగల యంత్రాంగం ఈసీ దగ్గరలేదని సో.. వారినే ఎన్నికల విధులకు కేటాయించాలని తిరుగు టపాలో సమాధానం ఇచ్చినట్టు సమాచారం



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "It is reported that the EC has rejected the proposal sent by Jagan Sarkar to the Center that teachers are not required for election duties."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0