Jobs In Railway
Jobs In Railway: 10వ తరగతి అర్హతతో.. రైల్వేలో 2521 పోస్టులకు నోటిఫికేషన్.
Jobs In Railway: వెస్ట్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2521 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వెస్ట్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2521 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది.
వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరి తేదీలోపు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు పశ్చిమ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను wcr.indianrailways.gov.in సందర్శించాలి.
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 డిసెంబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. చివరి తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు.
అభ్యర్థుల వయస్సు 17 నవంబర్ 2022 నుండి లెక్కించబడుతుంది. ఈ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.. 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
రిజర్వ్‌డ్ కేటగిరీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హత విషయానికొస్తే.. 10+2 నమూనాలో కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనితో పాటు.. వారు సంబంధిత రంగంలో ITI డిప్లొమా (NCVT లేదా SCVTకి అనుబంధంగా) కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తులకు.. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను https://iroams.com/RRCJabalpur/applicationIndex సందర్శించాలి. ఇక్కడ అప్లై ఆప్షను ఎంచుకోగలరు.
ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి.. వివరాలను నమోదు చేయాలి. తదుపరి దశలో లాగిన్ అయి.. దరఖాస్తు ఫారమ్‌ను పూరించి.. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు ఫీజును సమర్పించి.. ఫారమ్‌ను సమర్పించండి. చివరిగా ప్రింట్ అవుట్ తీసుకోగలరు.
0 Response to "Jobs In Railway"
Post a Comment