Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kaikala Satyanarayana Death

 మన కైకాల సత్యనారాయణ ఇకలేరు

Kaikala Satyanarayana Death

Kaikala Satyanarayana Death ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాసవిడిచారు.

ఆయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక కైకాల తెలుగు వారికి యముడిగా సుపరిచితుడు. ఎన్నో సినిమాల్లో యమధర్మరాజుగా కనిపించి మెప్పించాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు. విలనిజంలో కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. కామెడీ, ఎమోషన్ ఇలా ఏ పాత్రను ఇచ్చినా కూడా ఆయన తన పూర్తి న్యాయం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి.. ఇప్పటి తరం హీరోలతోనూ పని చేశారు. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.

మహేష్‌ బాబు, ప్రభాస్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ వంటి హీరోలతోనూ ఆయన నటించారు. చివరగా ఆయన మహర్షి సినిమాలో నటించారు. అయితే కైకాల ఇప్పుడు అస్తమవ్వడంతో తెలుగు చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. చివరగా కైకాల బర్త్ డేను చిరంజీవి సెలెబ్రేట్ చేశాడు.ఆయన బెడ్డు మీద ఉండగానే చిరంజీవి ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించాడు. చిరు అలా తన బర్త్ డేను సెలెబ్రేట్ చేయడంతో కైకాల మురిసిపోయారు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫోటోలు సైతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఈ ఏడాది వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ కుంగిపోయి ఉంటే.. ఇప్పుడు ఇలా కైకాల మరణంతో మరింతగా విషాదంలోకి నెట్టినట్టు అయింది.

ఆయన చరిత్ర ఇదీ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు.


సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా)

లవకుశ (1963)

పాండవ వనవాసం (1965)

పరమానందయ్య శిష్యుల కథ (1966)

ప్రేమనగర్ (1971)

తాతా మనవడు (1973)

నిప్పులాంటి మనిషి (1974) - షేర్ ఖాన్

జీవన జ్యోతి (1975)

సిరిసిరిమువ్వ (1976)

సెక్రటరీ (1976)

చక్రధారి (1977)

దాన వీర శూర కర్ణ (1977) - భీముడు

యమగోల (1977) -యముడు

శుభలేఖ (1982) - అంకెల ఆదిశేషయ్య

శ్రుతిలయలు (1987) - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు

రుద్రవీణ (1988)

నారీ నారీ నడుమ మురారి (1990) - జానకిరామయ్య

సూత్రధారులు (1990) - నీలకంఠయ్య

గ్యాంగ్ లీడర్ (1991) - జైలర్

భైరవ ద్వీపం (1994)

ముద్దుల ప్రియుడు (1994)

యమలీల (1994) - యముడు

ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు

సాహసవీరుడు - సాగరకన్య (1996)[6]

సూర్యవంశం (1998)

శుభాకాంక్షలు (1998) - సీతారామయ్య

సమరసింహారెడ్డి (1999)

మురారి (2001)

అరుంధతి (2009) *నరసింహుడు (2005)


*ఫిల్మ్‌ఫేర్ అవార్డులు*

జీవితకాల సాఫల్య పురస్కారం (2017)

నంది అవార్డులు

సవరించు

ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994)

రఘుపతి వెంకయ్య అవార్డు - 2011

సవరించు

ఇతర గౌరవాలు

సవరించు

ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు[7]

నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.

నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది

కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది

నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.

777 సినిమాలు ఇప్పటిదాకా

28 పౌరాణిక చిత్రాలు

51 జానపద చిత్రాలు

9 చారిత్రక చిత్రాలు

200 మంది దర్శకులతో పనిచేసాడు

223 సినిమాలు 100 రోజులు ఆడాయి

59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి

10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి

10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kaikala Satyanarayana Death"

Post a Comment