Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's find out why birds fly in a V shape.

పక్షులు V ఆకారంలో   ఎందుకు ఎగురుతాయో తెలుసుకుందాం.

Let's find out why birds fly in a V shape.

 ఒక్కోసారి ఆకాశంవైపు చూస్తే పక్షులు V ఆకారంలో ఎగరడం కనిపిస్తుంది. అది చూడ్డానికి ఎంతో అందంగా కూడా వుంటుంది. అయితే, ఇలా పక్షులు V ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? అన్న సందేహం కలగక మానదు. దీనికి కారణంతో పాటు పక్షుల గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.

పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు. ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.

శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.

అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
వీటిలో ఒకే ఒక గ్రంథి అయిన తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి. పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది. కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు అంటారు. ఆహార వాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది. నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూల మహా ధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.

ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాథమిక శ్వాస నాళికలకు మధ్య గల శబ్దిని ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
మూత్ర పిండాలు అంత్య వృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్థం.

ఆకాశంలో పక్షి గుంపులు V ఆకారంలో వెళ్లడంపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ముఖ్యమైన విషయాలు తెరపైకి వచ్చాయి. పక్షులు ఎందుకు అలా ఎగురుతాయో ప్రపంచానికి వెల్లడించారు. పక్షులు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి కారణం... ఈ ఆకారంలో పక్షులు సులభంగా ఎగరగలవు. ఇతర సహచర పక్షులతో అవి ఢీకొట్టవు. రెండవది.. పక్షుల గుంపులో అందరికీ మార్గనిర్దేశం చేసే నాయకుడు ఉంటాడు. ఎగురుతున్నప్పుడు ఆ నాయకుడు ముందుంటాడు. దాని వెనుకాలే ఇతర పక్షులు ఎగురుతాయి. ఆ కారణంగానే పక్షులు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో పయనిస్తాయట. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

లండన్‌ లోని రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ అషర్‌ వుడ్ ఉద్దేశం ప్రకారం.. ఇలా V ఆకారంలో పయనించడం వల్ల గాలి వేగాన్ని నియంత్రిగలుగుతాయట. ఇలా ఎగరడం వల్ల వాటి శక్తిని ఆదా చేసుకుంటాయట. పుట్టుకతోనే పక్షులకు ఇలా ఎగిరే కళ లేదని పరిశోధకులు చెబుతున్నారు. కాలక్రమేణా ఇతర పక్షులతో కలిసి నివసిస్తున్న క్రమంలో అవి నేర్చుకుంటాయని చెబుతున్నారు. V ఆకారంలో పక్షలు ఎగరాడానికి వాటిలో ఉండే పోటీతత్త్వమే కారణమన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పక్షుల మధ్య పోటీ లేదని తేల్చి చెప్పారు

పక్షులు సమానత్వాన్ని ప్రపదర్శిస్తాయట. అయితే, ఏదైనా పక్షి ముందుగా ఎగిరితే.. దానిని మిగతా పక్షులు ఫాలో అవుతాయట. ముందున్న పక్షి అలసిపోయినప్పుడు దాని స్థానంలో మరొక పక్షి ముందుకు కదులుతుందట. ముఖ్యంగా వలస పక్షులు V ఆకారంలో పయనిస్తాయట. అవి పొడవుగా వీ-షేప్‌లో ఎగురటం వలన అన్ని పక్షులకు నాయకుడిగా అవకాశం దక్కుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా, పూర్తిగా ఆరోగ్యకరమైన పక్షులు మాత్రమే ప్రధాన స్థానంలో ముందుకు సాగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's find out why birds fly in a V shape."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0