Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Masks must be worn in public places!

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిందే! :కేంద్ర ప్రభుత్వం

Masks must be worn in public places!


ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు (Corona Cases) అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది.

చైనా, జపాన్‌, అమెరికా సహా పలు దేశాల్లో ఈ మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి (Central Health Minister) మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై కరోనా (Corona Cases) పరిస్థితులను చర్చించి చర్యలు తీసుకొనేందుకు ప్రతివారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు.

ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు (Corona Cases) పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఆదేశించారు. ''కరోనా ఇంకా ముగిసిపోలేదు. అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

చైనా, అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు అంతగా లేవు, మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్నందున.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించాలంటే.. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహణ అవసరమని ఆయన చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Masks must be worn in public places!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0