Rationalization Info.
రేషన్లైజేషన్ ఇన్ఫో .
1.విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి వల్ల గాని,
(లేదా)
2.ఇతర పరిపాలనా కారణాల వల్ల గాని (నూతన విద్యా విధానం లో ప్రభుత్వం చేపట్టిన మ్యాపింగ్ కారణంగా)
ఒక పోస్టు ఒక స్కూల్ నుండి పోతుంటే దానిని రేషన్లైజేషన్ గా ఇంతవరకు గుర్తించారు. ఆ రకంగా రేషన్లైజేషన్కు గురైన వారికి పాయింట్లు కూడా ఇచ్చేవారు
కానీ ఇప్పుడు పరిపాలనా కారణాలవల్ల (మాపింగ్ వల్ల) రేషన్లైజేషన్కు గురైన వాళ్లకు మాత్రమే అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
1) రేషనలైజేషన్ పాయింట్లు 5.
గత బదిలీల్లో స్పెషల్ పాయింట్లను గాని, ప్రిఫరెన్షియల్ క్యాటగిరిని గాని వినియోగించుకొని కంపల్సరీ బదిలీ కానప్పటికీ రేషన్లలైజేషన్ వల్ల బదిలీ కావలసి వస్తే మళ్లీ ఆ పాయింట్లను వినియోగించుకోవచ్చు...
దీనికి అదనంగా.
3) 2021 లో బదిలీ అయి ప్రస్తుతం మ్యాపింగ్ వల్ల రేషన్లైజేషన్కు గురి అయితే పాత స్టేషన్ పాయింట్లను కూడా ఇస్తారు.
విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల రేష్నలైజేషన్కు గురైన వారికి ఎటువంటి పాయింట్లు ఈ బదిలీలలో ఇవ్వడం లేదు...
0 Response to "Rationalization Info."
Post a Comment