Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Shock for NPS employees.

NPS ఉద్యోగులకు షాక్.

Shock for NPS employees.

జనవరి నుంచి కొత్త రూల్స్...ఇక వాళ్ళు ఆన్లైన్ లో డబ్బులు విత్ డ్రా చేయలేరు

కోవిడ్ 19 కారణంగా పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్ఏడీఏ గతంలో రూల్స్‌ను సవరించింది

2021 జనవరి నుంచి ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు పాక్షికంగా ఎన్‌పీఎస్ డబ్బులను (Money) విత్‌డ్రా చేసుకునే వెలుసుబాటు కల్పించింది.

ఆన్‌లైన్‌లోనే ఈ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ అందుబాటులో ఉండేది.

అయితే ఇప్పుడు కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితులు సమసిపోయాయి. దీంతో పీఎఫ్ఆర్‌డీఏ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా తీసుకువచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ ఆన్‌లైన్ పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీని తొలిగిస్తున్నట్లు వెల్లడించింది.

గవర్నమెంట్ సెక్టార్‌కు సంబంధించి ఈ రూల్ వర్తిస్తుందని తెలిపింది.

అంటే ప్రభుత్వ ఉద్యోగులు .ఇకపై ఆన్‌లైన్‌లో కోవిడ్ 19 కింద పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.

2023 జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సెంట్రల్ అటానమస్ బాడీస్‌కు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి. గతంలో మాదిరి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ నుంచి డబ్బులు వితడ్రా చేసుకోవడం ఇక కుదరదని గుర్తించుకోవాలి.

ఇకపై వీరందరూ ఎన్‌పీఎస్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. అందుకు సంబంధించిన రిక్వెస్ట్‌ను సంబంధిత నోడల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది.

అయితే వాలంటరీ నాన్ గవర్నమెంట్ ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఆన్‌లైన్‌లో పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ కొనసాగుతుందని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. ఎన్‌పీఎస్ వాలంటరీ విభానికి చెందిన వారు ఆన్‌లైన్‌లో పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కనీసం మూడేళ్లు ఎన్‌పీఎస్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. విత్‌డ్రాయెల్ అమౌంట్ కంట్రిబ్యూషన్ అమౌంట్‌లో 25 శాతం దాటకూడదు. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు కేవలం మూడు సార్లు మాత్రమే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోగలరు.

పిల్లల చదువు, పిల్లల పెళ్లి, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం, క్రిటికల్ ఇల్‌నెస్ ట్రీట్‌మెంట్ కోసం డబ్బులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. పెన్షన్‌తో పాటు ఒకేసారి భారీ మొత్తంతో డబ్బులు లభిస్తాయి. మెచ్యూరిటీ తర్వాత ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరుతూ ఉంటారు. ఆన్‌లైన్‌లో కూడా మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Shock for NPS employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0