Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Smartphones are sacrificing relationships.. 84 percent of people are doing the same thing within 15 minutes of waking up.

బంధాలను బలితీస్తున్న స్మార్ట్ ఫోన్ . నిద్రలేచిన 15 నిమిషాల్లో 84 శాతం మంది అదే చేస్తున్నారట . 

 రోజుల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరగడానికి ప్రధాన కారణం.. టైమ్‌ ఇవ్వడం లేదు అనే ఉంటుంది.. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు.. కానీ ఆఫ్‌డేస్‌లో అయినా ఒకరితో ఒకరు టైమ్‌ స్పెండ్‌ చేస్తారా అంటే ఎవరి ఫోన్‌ వారు వాడుతుంటారు.

ఇది సవితి పోరు కంటే దారుణం. బంధాలను సెల్‌ఫోన్‌ బద్నాం చేస్తుందని తాజాగా జరిగిన ఓ సర్వేలో తేలింది.

సైబర్ మీడియా రీసెర్చ్, మనుషుల మీద ఫోన్ ఇంపాక్ట్ ఎంతలా ఉంది అనే విషయంపై సర్వే చేస్తే, షాకింగ్ రిజల్ట్స్ తెలిశాయి. మెజారిటీ కపుల్స్, ఫోన్ చూస్తున్నపుడు డిస్ట్రబ్ చేస్తే తమ భాగస్వామి మీద చిరాకు పడుతున్నారట. దీనివలన రిలేషిప్‌లో మనస్పర్థలు వస్తున్నాయని వాళ్లే ఒప్పుకున్నారు. 58% వినియోగదారులు భోజనం చేసేప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తూ తింటారట. నిద్ర లేచిన తర్వాత 15 నిమిషాల్లో 84 % ఇండియన్స్ ఫోన్ చేసుకుంటున్నారు..66% వినియోగదారులు ఫోన్ వల్ల మా లైఫ్ క్వాలిటీ పెరిగిందని నమ్ముతున్నారంట. 75% వినియోగదారులు ఫోన్ ఎక్కువగా వాడడం వలన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అంతేకాదు 74 శాతం నిర్ణీత సమయం పాటు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం అవుతుందని చెప్పారు. అయినా సరే 18 శాతం మంది మాత్రమే తమ ఫోన్లను స్వయంగా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిపారట.

పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంలోని వివిధకోణాలను అంచనా వేస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగపు పరిధి, లాక్ డౌన్ ప్రభావం, వ్యక్తిగత ఆరోగ్యం ఇతరత్రా అన్ని అంశాలను గురించి Vivo మొబైల్ కంపెనీ 'Smartphones and their impact on human relationships 2020' పేరుతో రెండో ఎడిషన్ ఫలితాలను వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు జీవితంలోనే అతి ముఖ్యమైనదిగా మారిపోయింది. స్నేహితులు, కుటుంబం, ప్రపంచం దేనితో కనెక్ట్ కావాలన్న సరే స్మార్ట్ ఫోన్ కావల్సిందే. ఇక కరోనా నేపథ్యంలో ప్రపంచం ఇంటికే పరిమితం అయిన సందర్భంలో దీని ప్రాముఖ్యత చాలా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు యావత్ ప్రపంచాన్ని మన అరచేతుల్లోనే చూపిస్తుంది..

మానవ సంబంధాలపై స్మార్ట్ ప్రభావం గురించిన అధ్యయనం ద్వారా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని వీవో ఇండియా లక్ష్యంగా పెట్టకున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ అధ్యయనంలోని ముఖ్యాంశాలు.

  • కోవిడ్ తర్వాత స్మార్ట్ ఫోన్ల వినియోగం 25 శాతం వరకు పెరిగింది.
  • స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండడం ముఖ్యమని 74 శాతం అభిప్రాయపడ్డారు.
  • నిద్ర లేచిన 15 నిమిషాల్లోపు 84 శాతం మంది తమ ఫోన్లు చెక్ చేసుకుంటారు.
  • జీవన నాణ్యత స్మార్ట్ పోన్లతో మెరుగవుతుందని 66 శాతం మంది నమ్ముతున్నారు.
  • స్మార్ట్ ఫోన్ నచ్చిన వ్యక్తులను దగ్గర చేసేందుకు ముఖ్యమైందని 79 శాతం మంది విశ్వసిస్తున్నారు.
  • కుటుంబ సభ్యులతో ఉన్నా సరే స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ గడుపుతామని 88 శాతం మంది తెలిపారు.
  • లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా భారతీయులు స్మార్ట్ పోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
  • స్మార్ట్ ఫోన్లో ఓటీటీ చూసేవారు 59 శాతం, సోషల్ మీడియా 55 శాతం, ఆటల కోసం వాడేవారు 45 శాతంగా ఉన్నారు.
  • స్మార్ట్ ఫోన్లు అత్యవసరమైన వస్తువుల్లో ఒకటిగా మారిపోయాయి. నిజమే కానీ చాలా మందికి ఇది వ్యసనంగా మారింది.
  • గంట సేపు ముఖాముఖి సంభాషణలో ఉంటే కనీసం 5 సార్లు ఫోను చూసుకునే వారు 46 శాతం మంది ఉన్నారు
  • స్మార్ట్ పోన్లు ఎక్కువగా వాడడం వల్ల మానవ సంబంధాలు, ఇతర ప్రవర్తన మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
  • ఆత్మీయులతో గడిపే సమయం మీద స్మార్ట్ ఫోన్ ప్రభావం ఉంటోందని 89 శాతం మంది ఒప్పుకున్నారు.
  • శారీరక మానసిక ఆరోగ్యం కోసం స్మార్ట్ ఫోన్లను తక్కువగా వాడటమే ముఖ్యం. స్మార్ట్ ఫోన్లలో తక్కువ సమయం గడిపితే 73 శాతం మంది సంతోషంగా ఉండగలరని చెబుతున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Smartphones are sacrificing relationships.. 84 percent of people are doing the same thing within 15 minutes of waking up."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0