Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers Transfers 2022 Info.

నిన్న సాయంత్రం 7గంటల నుండి 9 గంటల వరకు ఉపాధ్యాయ సంఘాల ONLINE  సమావేశం  లో రాష్ట్ర విద్యాశాఖ జెడి శ్రీ ఎం.రామలింగం గారు ఇచ్చిన సమాచారం.

Teachers Transfers 2022 Info.

1. సీనియార్టీ లిస్టులు అన్ని జిల్లాలకు ప్రకటించారు.

2. ఈరోజు, రేపు అబ్జక్షన్స్ ఉంటే ఆన్ లైన్ లోనే రేజ్ చేయాలి. ఆఫ్ లైన్ లో ఎలాంటి కంప్లైట్స్ తీసుకొనబడవు.

3. డిసెంబర్ 26 సోమవారం నాటికి ఫైనల్ సీనియార్టీ లిస్టు, ఖాళీలు ప్రకటన చేస్తారు.

4. స్పౌజ్ లేదా ప్రిఫరెన్షియల్ కు సంబంధించి కొద్దిమంది ఉపాధ్యాయులు డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయలేదు. వారు వెంటనే డాక్యుమెంట్ మాన్యువల్ గా వారి డి డి ఓ ల ద్వారా డి. ఇ. ఓ లకు అందచేయాలి.

5. ఎలాంటి కంప్లైట్స్ నైనా ఆన్ లైన్ లో రేజ్ చేస్తే స్థానిక జిల్లా విద్యా శాఖాధికారులు పరిశీలించి జన్యున్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 

6. కొంత మంది డి. డి. ఓ లు సర్ ప్లస్ పోస్టలలో సీనియర్ చేత అప్లై చేయించి , వారిచే అప్లికేషన్ ను మరలా డిలీట్ చేయించారు. కానీ జూనియర్ చేత అప్లై చేయించ లేదు. అట్టి డి. డి. ఓ. ల పై చర్యలుంటాయి . 

7. 2021 ప్రోమోషన్ పొందినవారు కూడా go 190 ప్రకారం ప్రిఫరెన్షియల్ వాడుకొనవచ్చు. వారికి రిమ్స్ నుండి సర్టిఫికేట్ లు పొందే అవకాశం లేదు కనుక వారి విషయం లో రేపు కమీషనర్ వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. 

8. 2021 లో adhoc ప్రోమోషన్ పొందిన ఎవరైతే 31-08-2024 లోపు రిటైర్డ్ అయ్యే వారు deo గారిని సంప్రదించి వారి అప్లికేషన్ డిలీట్ చేయించు కోవచ్చు. 

9. compulsory కానివారు బడిలీలలో పాల్గొనే ఉద్దేశం లేకపోతే వారి అప్లికేషన్ డిలీట్ చేయరు. రేపు options ఇచ్చేటప్పుడు వారి స్కూల్ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 

10. గత బదిలీలలో Spouse/ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడుకొని 5/8 సం. తిరిగి వినియోగించుకొనుటకు అప్లై చేసిన వారి పై , దృవీకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయి.

11.  3 నుండి 10 తరగతులున్న ప్రీ హై స్కూల్ లో కూడా 6-10 తరగతులలో 10 sections దాటితే రెండవ హిందీ పోస్ట్ ఇస్తారు.

12. ఎవరికి ఏ లాంటి అర్హత గల పాయింట్స్ రాకపోయినా వారు తప్పక ఆన్లైన్ లో కంప్లయింట్ raise చేయాలి.

13. 2021 లో పదోన్నతి పొంది కోర్టుకు వెళ్లి ఆ స్థానంలో అలాగే కొనసాగే వారు ట్రాన్స్ఫర్ కు అప్లై చేసుకున్న ఎడల వారు తమ ట్రాన్స్ఫర్ application ను క్యాన్సిల్ చేయమని డిఈఓ ద్వారా కమిషనర్ కు లెటర్ పెట్టుకున్నట్లయితే వారి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ క్యాన్సిల్ చేయబడుతుంది లేదా కోర్టు ఆర్డర్ విత్ డ్రా చేసుకుంటే బదిలీకి అర్హత పొందుతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers Transfers 2022 Info."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0