Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today is the last time teachers are ready to apply for transfer

బదిలీ దరఖాస్తుకు నేడే ఆఖరు సన్నద్ధమైన ఉపాధ్యాయులు

Today is the last time teachers are ready to apply for transfer

ఉపాధ్యాయుల బదిలీకి దరఖాస్తు చేసేందుకు శనివారంతో గడువు ముగియనుంది. ఒక్కరోజే సమయం ఉండడంతో అటు విద్యాశాఖ, ఇటు ఉపాధ్యాయుల్లో హడావుడి నెలకొంది. ఈ నెల 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనా శుక్రవారం నాటికి చేసే వారి సంఖ్య 20 శాతంలోపే ఉంది. తప్పనిసరి అయినవారే చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘టిస్‌’ డేటాలో తప్పులు ఉండడం, మార్పు చేర్పులు వస్తాయన్న ఆలోచనతో కొందరు, ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు ఇస్తారని, తేదీ పొడిగిస్తారని ఇంకొందరు వెనకడుగు వేస్తూ వచ్చారు. శనివారం వీరంతా దరఖాస్తు చేయనున్నారు.

హేతుబద్ధీకరణ తర్వాత 2,330 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 1483 పోస్టులు ఖాళీలే. 847 చోట్ల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి. అయిదేళ్లు నిండిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు నిండిన ఉపాధ్యాయులకు తప్పనిసరి కావడంతో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఎంఈవోలతో సమావేశమయ్యారు. కేడర్‌ స్ట్రెంత్‌ అప్‌డేషన్‌పై ప్రధానంగా చర్చించారు.

దిద్దుబాటు!

టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌(టిస్‌)లో వివరాలు తప్పుల తడకగా ఉండడంతో ఉపాధ్యాయులు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎక్కువ మందికి ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల సర్వీసు, పుట్టిన తేదీ తప్పుగా నమోదైనట్లు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లాలో శుక్రవారం 60-70 మంది డేటాలో తప్పులను డీఈవో లాగిన్‌లో సరిచేశారు. సమయాభావంతో ఎంఈవోల పరిధిలో తప్పులు సరిచేసుకునేలా అవకాశం కల్పించినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

సమస్యలపై మంత్రికి లేఖ

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ రాసినట్లు ఫోర్టో ఛైర్మన్‌ కె.హరికృష్ణ, కార్యదర్శి ఎస్‌.సింహాచలం తెలిపారు. రేషనలైజేషన్‌ కారణంగా బదిలీ అవుతున్న అందరికీ అయిదు పాయింట్లు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్‌ చేయడంతో బదిలీల్లో నష్టం జరుగుతుందన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today is the last time teachers are ready to apply for transfer"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0