Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is teaching, what is non-teaching?

ఏది బోధన.. ఏది బోధనేతరం?

What is teaching, what is non-teaching?

  • మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సింది ఉపాధ్యాయులే
  • నాడు-నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలూ వారికే
  • ఎన్నికల విధులు మాత్రమే ఎక్కువవుతాయా?
  • ప్రభుత్వానికి నచ్చనివన్నీబోధనేతర పనులేనట

ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని చెబుతున్న ప్రభుత్వమే వారితో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోంది.. ‘నాడు-నేడు’ కింద గదుల నిర్మాణాలు, మరమ్మతులను పర్యవేక్షించాలంటుంది. వీటిలో లోపాలున్నా, వెనుకబడినా షోకాజ్‌ నోటీసులిస్తూ ఉపాధ్యాయులను బెదిరిస్తోంది. ఎన్నికలు, జనగణన పనులకు ఉపాధ్యాయులను దూరంగా పెట్టేందుకు విద్యా హక్కు చట్ట నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం బోధన, విద్యేతర పనులకు సొంత భాష్యం చెబుతోంది. తనకు నచ్చిన పనులను బోధన పనుల్లోను.. తనకు ఇష్టం లేనివి బోధనేతర పనుల్లోను కలిపేస్తోంది. బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారని విద్యా హక్కు చట్టం సవరణల్లో పేర్కొన్న ప్రభుత్వం.. ఫొటోలు తీయడాన్ని, నిర్మాణాల పర్యవేక్షణను తప్పించాలన్న విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

షోకాజ్‌ నోటీసులా?

‘నాడు-నేడు’ పనుల్లో పేలవమైన పనితీరు కనబరిచారంటూ అన్నమయ్య జిల్లా విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. పనుల పురోగతిలో జాప్యంతో ఖర్చులు పెరిగాయని, అంచనాలు దాటిపోయాయని పేర్కొన్నారు. ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. భవనాలు కట్టించడం, మరమ్మతు పనులు చేయించడం బోధన పనులేనా? వీటిలో జాప్యమంటూ ఉపాధ్యాయులకు నోటీసులు ఎలా ఇస్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీటికి ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని, ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఉపాధ్యాయులను భాగస్వాములను చేసి, ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటున్నారు.

గురువులతో మరుగుదొడ్ల చిత్రాలా?

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తున్నారు. చాలాచోట్ల ఉపాధ్యాయులు వంతులవారీగా ఈ ఫొటోలను తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. రోజూ మరుగుదొడ్ల శుభ్రతపై 4-8 ఫొటోలు తీయాల్సి వస్తోంది. ఫొటోలు తీసి, అప్‌లోడ్‌ చేసేందుకు 20 నిమిషాల సమయం వృథాగా పోతోంది. నెట్‌వర్క్‌ సమస్య ఉన్నచోట మరింత సమయం పడుతోంది. విద్యార్థులు అభ్యసన సమయాన్ని కోల్పోతున్నా దీన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఏకోపాధ్యాయ బడుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం మెనూ ఫొటోలను రోజూ తీసి అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. బోధనేతర పనులకు ఇతర సిబ్బందిని నియమించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... ఎన్నికల విధులను మాత్రం బోధనేతర పనిగా పేర్కొంటూ తప్పించేందుకు సిద్ధమైందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is teaching, what is non-teaching?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0