Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A DA for Sankranti

సంక్రాంతికి ఒక డిఎ


ఉద్యోగ సంఘాలకు సిఎం హామీ

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండు కొత్త డిఎల్లో ఒక డిఎను సంక్రాంతి రోజు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన్నట్లు ఎపి ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల జెఎసి వెల్లడించింది. సీఎం జగన్ ను పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిశాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల డైరీలు, క్యాలెండర్లను సిఎం ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులు పలు వినతిపత్రాలు సిఎంకు అందించారు.

బకాయి పడ్డ వివిధ ఎపిజిఎల్స్ఐ, పిఎఫ్, డిఎ లోన్లు, క్లైమ్స్ కొంతమేర జనవరి ఆఖరులోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఎపి జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన 62 పదవి విరమణ వయస్సును పబ్లిక్ సెక్టార్, ఇతర విద్యాసంస్థల ఉపాధ్యాయులకు అమలు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని సిఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లామని, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని సానుకూలత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన వారిలో జెఎసి కో చైర్మన్లు హెచ్ తిమ్మన్న, కెఎస్ఎస్ ప్రసాద్, సీతారామరాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కెవి శివారెడ్డి తదితరులు ఉన్నారు. ఎపి సివిల్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు పి ధర్మచంద్రారెడ్డి, కె మోహన్ కుమార్, ఈ మురళి, ఎపి సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కె వెంకటరామిరెడ్డి, నాయకులు సిహెచ్ ఎర్రన్న యాదవ్, ఎం సత్య సులోచన, ఎపి ప్రభుత్వం ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ, నాయకులు అస్కార్ రావు, జిఎం రమేష్, వైఎస్ఆర్ఎఫ్ నాయకులు ఓబులాపతి, జాలిరెడ్డి, అశోక్, సుధీర్, పిఆర్ టియు అధ్యక్షులు గిరిప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A DA for Sankranti"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0