IB Recruitment 2023
IB Recruitment 2023: పది అర్హతో.. ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు.. మారిన తేదీలు వాటి వివరాలు.
ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ నుండి మొత్తం 1,675 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా IB అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలేదా ncs.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగుస్తుంది. మొదట అప్లికేషన్లను జనవరి 21 నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించినా.. దానిని వాయిదా వేస్తున్నట్లు ఐబీ నోటీస్ జారీ చేసింది. దీంతో పాటు.. వయస్సు కట్ ఆఫ్ తేదీని మొదట 17.02.2023గా పేర్కొనగా..దానిని 10.02.2023కు కుదించారు.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్ట్‌లు - 1,675
సెక్యూరిటీ అసిస్టెంట్ - 1525 పోస్టులు
MTS - 150 పోస్టులు2
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో 07, హైదరాబాద్ లో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ - 28.01.2023
దరఖాస్తు కు చివరి తేదీ - 17.02.2023
అర్హతలు
ఈ పోస్టులకు కనీస విద్యార్హత 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్. అభ్యర్థుల పరిమితి MTSకి 18-25 సంవత్సరాలు మరియు SA/EXE పోస్టులకు 27 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వయోపరిమితిని నిర్ణయించడానికి కటాఫ్ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ 17.02.2023
దరఖాస్తు ఫీజు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించాలి. దీనితోపాటు రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ రిక్రూట్‌మెంట్‌కు ఎంపిక కావడానికి అభ్యర్థులు టైర్ 1 మరియు టైర్ 2 పరీక్షలను రాయాలి. టైర్ 1 ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. అయితే టైర్ 2 పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది.
జీతం
సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 3 ప్రకారం రూ.2,10,700 నుండి రూ.69,010 వరకు చెల్లించబడుతుంది. మరోవైపు ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18 వేల నుంచి రూ.56 వేల 900 చెల్లిస్తారు.
0 Response to "IB Recruitment 2023"
Post a Comment