In Village and Ward Secretariats 14,253 posts.. in February Notification!
గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,253 పోస్టులు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్!.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో తీపి కబురు చెప్పారు. గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 14వేల 253 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏప్రిల్ లో రాత పరీక్షలు నిర్వహించే యోచన లో అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అత్యధికంగా పశుసంవర్ధక శాఖలో 4765 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. హార్టికల్చర్ అసిస్టెంట్ 1005 పోస్టులు, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990 పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982 పోస్టులు మరియు డిజిటల్ అసిస్టెంట్ 736 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అన్నిటికీ ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
0 Response to " In Village and Ward Secretariats 14,253 posts.. in February Notification!"
Post a Comment