India Post Recruitment 2023
India Post Office : 10వ తరగతి, ఇంటర్ పాసైన వాళ్లకు గుడ్‌న్యూస్. 98,083 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్. బీ రెడీ..!
Post Office Recruitment 2023 : ఇండియన్ పోస్టల్ (Post Office) 98,083. డిపార్ట్మెంట్ పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ-టాస్కింగ్ ఖాళీలను ఇప్పటికే ప్రకటించింది.
ప్రధానాంశాలు:
- ఇండియా పోస్ట్ 98,083 జాబ్స్
- 10వ తరగతి పాసై ఉంటే చాలు
- త్వరలో నోటిఫికేషన్ విడుదల..!
India Post Recruitment 2023 :10వ తరగతి చదివిన నిరుద్యోగులకి గుడ్‌న్యూస్. ఇండియన్ పోస్టల్ (Post Office) 98,083. డిపార్ట్మెంట్ పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ-టాస్కింగ్ ఖాళీలను ఇప్పటికే ప్రకటించింది. ఇండియా పోస్ట్ తన అధికారిక వెబ్ సైట్ https://www.indiapost.gov.in/ లో ఈ ప్రకటన చేసింది. అయితే.. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన వేర్వేరు నోటిఫికేషన్లు వెలువడలేదు. త్వరలో వెలువడే అవకాశాలున్నాయి.
మొత్తం ఖాళీలు : 98,083
పోస్ట్‌మ్యాన్ 59,099, మెయిల్ గార్డు 1445 ఖాళీలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ పోస్టుల కోసం 23 సర్కిళ్లలో మొత్తం 37,539 ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీల్లో ఏపీ సర్కిల్ పరిధిలో 2289 పోస్ట్‌మెన్ ఉద్యోగాలు.108 మెయిల్ గార్డ్ జాబ్స్.1166 ఎంటీఎస్ పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్ పరిధిలో 1553 పోస్ట్‌మెన్ జాబ్స్.. 82 మెయిల్ గార్డ్ పోస్టులు.. 878 ఎంటీఎస్ పోస్టులున్నాయి. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
ఖాళీల సంఖ్య: 98,083
- పోస్ట్‌మ్యాన్: 59,099 పోస్టులు
- మెయిల్ గార్డు: 1445 పోస్టులు
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 37,539
అర్హతలు: పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: ఎంపికైన వారికి జీతం రూ. 33,718 నుండి రూ. 35,370 వరకు ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్:https://www.indiapost.gov.in/
Website : https://iimlcmee.org/india-post-office-recruitment-2022/
0 Response to "India Post Recruitment 2023"
Post a Comment