Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiring Story

 Inspiring Story: నిరుపేద కుటుంబంలో పుట్టి 25 ఏళ్లకే హైకోర్టు జడ్జి అయిన గాయత్రి.. నేటి తరానికి స్ఫూర్తి ఈ చదువుల తల్లి.

Inspiring Story

పట్టుదలతో ప్రయత్నిస్తే.. మనుషులే ఋషులవుతారు.. మహాపురుషులవుతారని ఓ సినీ కవి చెప్పినా.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం చెప్పినా అది కొంతమంది యువత మాత్రమే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

కృషి, పట్టుదలతో తమ కలలను నిజం చేసుకుంటారు. ఇందుకు ఉదాహరణగా నిలచింది ఓ చదువుల తల్లి .. నిరుపేద కూతురు గాయత్రీ. 25 ఏళ్లకే కర్ణాటకలోని కోలారు సివిల్‌ కోర్టు జడ్జిగా నియమితురాలైంది. నిరుపేద కుటుంబంలో పుట్టినా.. అహర్నిశలు పట్టుదలతో చదివి ఈ రోజు జడ్జిగా అవకాశాన్ని అందుకుంది గాయత్రీ. నేటి తరం యువతకు స్ఫూర్తినిచ్చే గాయత్రీ గురించి తెల్సుకుందాం..

బెంగళూరులోని విధానసౌధం ఎదురుగా కర్ణాటక హైకోర్టు పనిచేస్తుంది. ఈ కోర్టులో సివిల్ జడ్జీల పోస్టులకు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన నారాయణసామి-వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె ఎన్.గాయత్రి (వయస్సు 25) హాజరయ్యారు. కోర్టు సివిల్ జడ్జి పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బంగారుపేటకు చెందిన గాయత్రి ఉత్తీర్ణత సాధించింది. త్వరలో హైకోర్టు సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చిన్న వయసులోనే హైకోర్టు సివిల్ జడ్జిగా ఎంపికైన గాయత్రి చరిత్ర సృష్టించారు.

బంగారుపేట సమీపంలోని యళబుర్గికి చెందిన గాయత్రి.. కరహళ్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసింది. అనంతరం కేజీఎఫ్‌లోని కెంగల్‌ హనుమంతయ్య కాలేజీలో 2021 లో లా పూర్తి చేశారు. యూనివర్సిటీ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. అప్పుడు సివిల్‌ జడ్జి పోస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అనంతరం పట్టుదలతో ప్రయత్నించి ఈ సారి విజయాన్ని సొంతం చేసుకుంది. అట్టడుగు వర్గానికి చెందిన గాయత్రి కష్టపడి ఈరోజు సివిల్ జడ్జిగా ఎంపికైంది. వివిధ పార్టీలు గాయత్రీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నారాయణస్వామి, వెంకట రత్నమ్మల ఏకైక కుమార్తె గాయత్రి. ఇద్దరూ రోజువారి కూలి పనులకు వెళ్లి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనే కూతుర్ని చదివించారు. తల్లిదండ్రుల తపనను కష్టాన్ని అర్ధం చేసుకున్న గాయత్రి కష్టపడి చదివింది. తన భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చింది. 25 ఏళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పదవిని చేపట్టనున్న గాయత్రీ.. ఓ సాధారణ దినసరి కూలి కూతురు న్యాయమూర్తి గాయత్రి అయ్యింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiring Story"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0