Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagan Sarkar good news for lakhs of priests: one hundred percent

 లక్షలాది మంది అర్చకులకు జగన్ సర్కర్ గుడ్ న్యూస్ : నూటికి నూరు శాతం

Jagan Sarkar good news for lakhs of priests: one hundred percent

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అర్చకులు, వారి కుటుంబాలకు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది.

వందశాతం మెడికల్ రీఎంబర్స్‌మెంట్‌ను ప్రకటించింది. అన్ని స్థాయిల్లో ఉన్న అర్చకులకు ఈ సౌకర్యాన్ని వర్తింపజేసింది. అర్చకులకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ నూటికి నూరు శాతం భరిస్తామని వెల్లడించింది. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వందశాతం..

ఇదివరకు కూడా ఈ మెడికల్ రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం అమలులో ఉండేది. అప్పట్లో 50 శాతం వరకు మాత్రమే భరించేది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన సగం ఖర్చును అర్చకులే భరించాల్సి వచ్చేది. వారి ఆర్థిక అవసరాలు, వైద్యానికి అయ్యే వ్యయం.. వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జగన్ సర్కార్- ఆ సౌకర్యాన్ని పెంచింది. వందశాతం మేర భరిస్తామని ప్రకటించింది. దేవాదాయ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని వెల్లడించారు.

యాక్షన్ ప్లాన్..

అర్చకుల సమస్యలను పరిష్కరించే దిశగా వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఇందులో భాగంగా అర్చకులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి అయ్యే ఖర్చును నూరుశాతం భరించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోన్న అర్చకులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి త్వరలోనే ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నామనీ ఆయన చెప్పారు.

పలు సంక్షేమ పథకాలు..

అర్చకుల కోసం జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. వివాహాలకు రుణాలు, ఉపనయనం కోసం గ్రాంట్‌ను చెల్లిస్తోంది. గృహ నిర్మాణానికి రుణ మొత్తాన్ని మంజూరు చేస్తోంది ప్రభుత్వం. ఇళ్ల మరమ్మతుల కోసం కూడా నిధులను కేటాయిస్తోంది. అర్చక కుటుంబాల పిల్లల చదువు కోసం గ్రాంట్ ను మంజూరు చేసే పథకాన్ని అమలు చేస్తోంది. ఇంజినీరింగ్, మెడిసిన్, న్యాయవిద్య, చార్టెడ్‌ అకౌంటెన్సీతో పాటు వృత్తి విద్యలకు రుణాన్ని ఇస్తోంది ప్రభుత్వం.

అర్చక సంఘాల హర్షం..

పదవీ విరమణ చేసిన అర్చకుల కోసం రిటైర్మెంట్‌ గ్రాంటును సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా అర్చకులు, వారి కుటుంబాల కోసం పూర్తి మెడికల్ రీఎంబర్స్‌మెంట్‌ను ప్రకటించింది. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అర్చక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తోన్నాయి. దీన్ని స్వాగతిస్తోన్నాయి. వందశాతం మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ప్రకటించడం వల్ల వైద్య ఖర్చుల నుంచి బయటపడినట్టయిందని వ్యాఖ్యానిస్తోన్నాయి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagan Sarkar good news for lakhs of priests: one hundred percent"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0