NLC India Jobs 2023
NLC India Jobs 2023: రాత పరీక్షలేకుండా నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో 626 ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం.
భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. 626 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
1.Graduate Apprentices 318
2.Technician Apprentices 308
Total Posts : 626
ఈ అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో జనవరి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.12,524ల నుంచి రూ.15,028ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల వివరాలు.
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 81
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 12
- సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 25
- మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 73
- కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ పోస్టులు: 52
- కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 9
- మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు: 42
- ఫార్మసీ పోస్టులు: 14
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీల వివరాలు.
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 82
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
- సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 49
- మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 83
- కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ పోస్టులు: 40
- మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు: 35
అడ్రస్.
The Generak Nanager,
Learning and Development Centre,
NLC India Limited,
Neyveli-607803.
0 Response to "NLC India Jobs 2023"
Post a Comment