PM Mudra Scheme
Mudra Loan : ఈ ప్రభుత్వ బ్యాంక్ నుంచి రూ . 10 లక్షల రుణం .. ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు.
PM Mudra Scheme మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారా?
లేదంటే వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నారా? అయితే చేతిలో డబ్బులు లేవా? మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ముద్రా స్కీమ్ అందిస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఎలాంటి తనఖా అవసరం లేదు. ఈ స్కీమ్ ద్వారా నాలుగు బెనిఫిట్స్ పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అంతేకాకుండా ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఎలాంటి తనఖా అవసరం లేదు.
ఈ స్కీమ్ కింద తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి ఐదేళ్ల కాలంలో తిరిగి చెల్లించొచ్చు. అంటే మీరు గరిష్టంగా ఐదేళ్ల వరకు ఈఎంఐ టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్ల కాలంలో డబ్బులు కట్టలేకపోతే టెన్యూర్ మరింత పొడిగించుకోవచ్చు.
ముద్రా స్కీమ్‌లో చేరిన వారికి ముద్ర కార్డు అందిస్తారు. అందువల్ల మీరు ఈ కార్డు ద్వారా మీకు కావాల్సిన మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా మీరు ఉపయోగించుకున్న మొత్తంపైనే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ముద్రా కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకున్న అమౌంట్ పైనే వడ్డీ పడుతుంది.
మీరు పార్ట్‌నర్‌షిప్ ద్వారా బిజినెస్ చేస్తున్నా కూడా ముద్రా స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. మూడు కేటగిరిల కింద రుణాలు మంజూరు చేస్తారు. కేటగిరి ప్రాతిపదికన లోన్ అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది.
ప్రభుత్వ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు నుంచి మీరు ముద్రా స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. అందువల్ల మీరు మీకు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి ముద్రా స్కీమ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.
శిశు లోన్ కేటగిరి కింద రూ. 50 వేల వరకు రుణం మంజూరు చేస్తారు. అలాగే కిశోర్ లోన్ కేటగిరి కింద రూ. 5 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇక తరుణ్ కేటగిరి కింద రూ. 10 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తారు.
మీరు ఉద్యమ్‌మిత్ర వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ముద్రా లోన్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అవసరమైన వివరాలు అందించాలి. లేదంటే పలు బ్యాంకులు వాటి సొంత వెబ్‌సైట్లలో కూడా ముద్రా లోన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంచాయి.
0 Response to "PM Mudra Scheme"
Post a Comment