Shockingly, the higher a man's height, the higher his risk of certain types of cancer.
Cancer and Height: షాకింగ్, మనిషి ఎత్తు ఎక్కువగా ఉంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.
క్యాన్సర్ అనేది శరీరంలో వివిధ భాగాలకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీని చికిత్స కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. శరీరంలో కణాలు ఒకే చోట అనియంత్రితంగా పెరిగి గడ్డల్లా ఏర్పడి, క్యాన్సర్ కణితిగా మారుతుంది.
ఇది ఇతర భాగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరికి ముసలితనం రాగానే వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉన్నవారు ఉన్నా కూడా రావచ్చు. పొగాకు, మద్యపానం అధికంగా తాగే వాళ్ళకి వచ్చే ముప్పు ఎక్కువ. రేడియేషన్కు గురయ్యే వారికి కూడా క్యాన్సర్ ప్రమాదం అధికమే. అయితే ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం ఎత్తు కూడా ఆ వ్యక్తి క్యాన్సర్కు గురవుతాడో లేదో నిర్ధారిస్తుందని తేలింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ప్రకారం మనిషి ఎత్తు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నిర్ధారిస్తుంది.
ఈ క్యాన్సర్లు రావొచ్చు
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనా బృందం ప్రపంచవ్యాప్తంగా ఎత్తుగా ఉన్న మనుషుల ఆహారం, బరువు, శారీరక శ్రమ, ఆరోగ్యం వంటి డేటాలను సేకరించి పరిశీలించింది. ఇందులో మనిషి ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే, అంత అధికంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, రొమ్ము, కిడ్నీ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని తేలింది.
ఎత్తుగా ఉన్న మనుషులకు కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పది శాతం ఎక్కువ
మెనోపాజ్ కి ముందు లేదా తరువాత రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 9 నుంచి 11% ఎక్కువ.
అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 8 శాతం
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 5 శాతం
ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం నాలుగు శాతం అధికం అని తేలింది.
వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ప్రోగ్రాం మేనేజర్ సూజన్ బ్రౌన్ మాట్లాడుతూ ఒకరి ఎత్తు క్యాన్సర్ ప్రమాదాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుందో వివరించారు. ఆమె చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి ఎత్తు అనేది తల నుండి పాదాల మధ్య దూరం. ఈ దూరం ఎక్కువ ఉంటే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఎత్తు ప్రక్రియ జన్యువులు నిర్ణయించడమే కాదు కొన్ని రకాల ఇతర కారకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్లు, ఈస్ట్రోజన్ వంటి సెక్స్ హార్మోన్లు ఈ ఎత్తు అధికం అవ్వడానికి కారణమని చెప్పుకోవచ్చు.
అయితే పొడవుగా ఉండడం ఒక శాపం అని చెప్పడం లేదు. మధుమేహం, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి రోగాలు వచ్చే అవకాశం పొడవుగా ఉండే వారిలో తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎత్తుగా ఉండడం కొన్ని విషయాల్లో వరమనే చెప్పాలి. అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం ద్వారా అడ్డుకోవచ్చు. ధూమపానం, మద్యపానం వంటివి పూర్తిగా మానేయాలి.
క్యాన్సర్ లక్షణాలు
- 1. విశ్రాంతి తీసుకున్న కూడా తీవ్రమైన అలసట
- 2. హఠాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం
- 3. శరీరంలో ఎక్కడైనా వాపు లేదా గడ్డలు రావడం
- 4. హఠాత్తుగా శరీరంలో ఎక్కడైనా నొప్పి ప్రారంభం కావడం
- 5.చర్మం రంగులో మార్పులు రావడం
- 6.గొంతు బొంగురు పోవడం
- 7. మూత్రంలో రక్తం పడడం
- 8. జ్వరం అధికంగా రావడం
- 9. రాత్రుళ్లు చెమట పట్టడం
- 10. తలనొప్పి
- 11. దృష్టి, వినికిడి సమస్యలు కలగడం
ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలే ఇందులో ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
0 Response to "Shockingly, the higher a man's height, the higher his risk of certain types of cancer."
Post a Comment