SSC MTS 2023 Notification PDF Out for 11409 MTS and Havaldar Posts
SSC MTS 2023 Notification PDF Out for 11409 MTS and Havaldar Posts.
కేంద్రప్రభుత్వ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో దాదాపు 11 వేలకు పైగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 18న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 17 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టులు వివరాలు
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022
మొత్తం ఖాళీలు: 11,409
1) మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 10,880 పోస్టుల
2) హవాల్దార్ (సీబీఐసీ, సీబీఎన్): 529 పోస్టులు (హైదరాబాద్-8)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1998 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1996 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
కరెక్షన్ ఫీజు: దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మొదటిసారి రూ.200, రెండోసారి అయితే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తుల సమయంలో పొరపాట్లు లేకుండా వివరాలు నమోదచేయడం మంచిది.
పరీక్ష విధానం..
మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.
మొదటి సెషన్లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.
రెండో సెషన్లో జనరల్ అవెర్నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.
పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25%, ఇతరులకు-20% గా నిర్ణయించారు.
మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
హవిల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు:
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.01.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.02.2023 (23.00)
ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.02.2023 (23.00)
ఆఫ్లైన్ చలనా జనరేట్ చేసుకోవడానికి చివరితేది: 19.02.2023 (23.00)
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 20.02.2023.
దరఖాస్తుల సవరణకు అవకాశం: 23.02.2023 - 24.02.2023 (23:00)
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: ఏప్రిల్, 2023.
0 Response to "SSC MTS 2023 Notification PDF Out for 11409 MTS and Havaldar Posts"
Post a Comment