Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Students Stress Problems

 Students Stress Problems : పరీక్షల భయం వెంటాడుతుందా ? ఈ సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే ఒత్తిడి నుండి దూరం అవవచ్చు.

Students Stress Problems

ప్రస్తుతం పాఠశాలల్లో కాలేజీల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత మొత్తం పరీక్షా కాలంగానే పేర్కొనాలి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరికి మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి.

ఇంటర్, టెన్త్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఒత్తిడికి గురైతే తల్లిదండ్రులు కూడా వారి స్థితిని చూసి మరింత ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ బట్టే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. దీంతో పరీక్షల్లో ఫెయిలైతే ఎలా అనే భయం వెంటాడుతుంది. పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ అయితే ఆ కంగారు వేరే లెవెల్లో ఉంటుంది. వారు చేసే చిన్న చిన్న తప్పులు వారి ర్యాంకింగ్ పై ప్రభావం చూపుతాయని ఆందోళన ఉంటుంది. అయితే పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడడానికి నిపుణులు కొన్ని చిట్కాలను చెబుతున్నారు. వాటిని పాటిస్తే ఒత్తిడి లేకుండా పరీక్షల్లో విద్యార్థుల పెర్ఫార్మెన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే నిపుణులు తెలిపే ఆ చిట్కాలేంటో ఓ సారి చూద్దాం.

ధ్యానం

ఈ చిట్కా గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి సమస్య ప్రభావవంతంగా తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కూర్చిలో కానీ, కింద గానీ మనకు సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత మనస్సుతో ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని, తర్వాత స్లో గా దాన్ని నోటి ద్వారా వదలాలి. ఇలా వీలైనన్ని ఎక్కువ సార్లు చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. గదిలో వచ్చే చిన్న చిన్న శబ్ధాలను కూడా గమనించకుండా ప్రశాంతంగా ఒకటి నుంచి పది అంకెల వరకూ లెక్కపెడూత శ్వాసపై ధ్యాసతో సాధన చేస్తే ఒత్తిడి సమస్య నుంచి ఇట్టే బయటపడవచ్చు.

ఒత్తిడి లేని జోన్ సృష్టించుకోవడం

విద్యార్థులు స్థిరమైన హడావుడితో విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఒత్తిడి సమస్యను బయటపడవచ్చు. చదువుకోవడం తప్ప ఇతర వ్యాపకాలపై కాసేపు దృష్టి మరలిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంగీతం వినడం, ఆడుకోవడం, పెయింటింగ్ చేయడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం వంటి చర్యలతో మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఒక్కోసారి చదువుకునే గదిని శుభ్రపరుచుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం

ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మెదడు పనితీరును మెరుగుపర్చడానికి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా చాక్లెట్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. గుడ్లు, చేపలు, కాయధాన్యాలు, పాల ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు, గింజలు మొదలైన వాటితో సహా కొన్ని ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ప్రోటీన్ మెదడు రసాయనాలను రూపొందించడంలో సహాయపడుతుంది.

పునరుజ్జీవనం

ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ రోజులో కొన్ని నిమిషాలు వెచ్చించడం వల్ల మీరు రిలాక్స్‌గా ఉండగలుగుతారు. దీంతో తర్వాత సిలబస్‌పై దృష్టి పెట్టడానికి మీ మనస్సును క్లియర్ చేయవచ్చు. పవర్ యోగా, కొన్ని క్రీడలు, జాగ్ వంటి కొన్ని రక్తాన్ని పంపింగ్ చేసే కొన్ని కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Students Stress Problems"

Post a Comment