Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

There are many benefits if you start saving from a young age

 చిన్న నాటి నుంచే పొదుపు మొదలుపెడితే ఎన్నో ప్రయోజనాలు.

There are many benefits if you start saving from a young age

బాలికలు పెద్దయ్యాక వారి భారీ మొత్తాలను పొందడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు చాలా పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి.

తల్లిదండ్రులు వీటిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కీలకం. పెట్టుబడులు పెట్టేముందు మాత్రం ఎక్స్​పర్టులను సంప్రదించి తమ పిల్లలకు అనువైన పెట్టుబడులను ఎంచుకోవాలి. పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్ట్​ అమిత్​ గుప్తా ప్రకారం బాలికల కోసం అందుబాటులో ఉన్న మంచి పథకాలు ఇవి:

సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై)

సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై) కింద 0-10 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఖాతాను తెరవొచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు. ప్రస్తుతం, ఎస్ఎస్​వై ఏడాదికి 7.6 శాతం వడ్డీ ఇస్తుంది. ఎస్ఎస్​వై ఖాతాను తెరవడానికి కనీస మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.250 కి తగ్గించారు. ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్​ చేయవచ్చు. 'ఎస్​ఎస్​వై, బాలికలకు అత్యుత్తమ పెట్టుబడి పథకం. కమర్షియల్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఎస్ఎస్​వై ఖాతా తెరవడం ద్వారా తమ కుమార్తెలకు మంచి భవిష్యత్​ను ఇవ్వవచ్చు" అని ఎస్​ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ, అమిత్ గుప్తా అన్నారు.

చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్

చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలోని ఆడ పిల్లల కోసం అద్భుతమైన ప్లాన్. దీనికి ఐదేళ్ల వరకు లాక్ ​ఇన్​ పీరియడ్​ ఉంటుంది. హయ్యర్​ ఎడ్యుకేషన్​ వంటి అవసరాల కోసం ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీరేటు ఏడు శాతానికి పైగా ఉంటుంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​ను పోస్టాఫీసులు అందిస్తాయి. ఇది తక్కువ- రిస్క్ గల ప్రభుత్వ పథకం. ఎన్ఎస్​సీలో చాలా ఆకర్షణలు ఉంటాయి. బాలికలకు అనువుగా ఉంటుంది. దీనిపై ఏటా ఏడుశాతం వడ్డీ ఇస్తారు. 

యూనిట్ లింక్డ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆడ పిల్లల కోసం అందుబాటులో ఉన్న గొప్ప ప్లాన్‌లలో ఒకటని గుప్తా అంటారు. ఈ ప్లాన్ అద్భుతమైన రాబడిని అందిస్తుంది. ఇందులో లైఫ్​ఇన్సూరెన్స్​తోపాటు పెట్టుబడి ప్రయోజనాలూ ఉంటాయి. 

సీబీఎస్​ఈ ఉడాన్ పథకం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (హెచ్​ఆర్​డీ) మంత్రిత్వ శాఖ సహకారంతో బాలికల కోసం సీబీఎస్​ఈ ఉడాన్ పథకాన్ని నిర్వహిస్తుంది. ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరే విద్యార్థినులకు దీని ద్వారా స్కాలర్​షిప్స్​ ఇస్తారు. ప్రీ, పోస్ట్​మెట్రిక్​స్కాలర్​షిప్స్​ కూడా ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "There are many benefits if you start saving from a young age"

Post a Comment