Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vasant Panchami

Vasant Panchami : వసంత పంచమి రోజున సరస్వతిని ఇలా పూజించండి . శ్రీ పంచమి శుభ సమయం , తేదీ , ప్రాముఖ్యత తెలుసుకోగలరు.

Vasant Panchami

 పుష్యమాసం అనంతరం మాఘ మాసం వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘమాసానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతి ప్రథమైనది. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీ స్నానము చేసి, విష్ణుమూర్తిని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుందని విశ్వాసం. మాఘమాసంలో అనేక పండగలు వస్తాయి. ఆ పండగల్లో ఒకటి వసంత పంచమి. ఈసారి వసంత పంచమి పండుగ 26 జనవరి 2023న వచ్చింది. వసంత పంచమి రోజున.. చదువుల తల్లి సరస్వతి దేవిని పూజిస్తారు. జ్ఞానం, కీర్తిని అందించే వసంత పంచమి శుభ సమయం, తేదీ, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.

వసంత పంచమి తేదీ ముహూర్తం
వసంత పంచమి రోజు అన్ని రకాల శుభ కార్యాలకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈసారి 26 జనవరి 2023 న వసంత పంచమి వచ్చింది. పంచాంగం ప్రకారం.. మాఘ మాసం పంచమి తిథి జనవరి 25, 2023న మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది జనవరి 26న ఉదయం 10:38 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో.. కొన్ని పండుగలను ఉదయ తిథి ఆధారంగా మాత్రమే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఉదయ తిథి ప్రకారం.. పంచమి పంచమి 26 జనవరి 2023 న జరుపుకుంటారు.

వసంత పంచమి పూజ ముహూర్తం: 07:12 నుండి 12: 33 వరకు: 5 గంటల 21 నిమిషాలు

వసంత పంచమి ప్రాముఖ్యత
వసంత పంచమి రోజు నుండి వసంత రుతువు ప్రారంభమవుతుంది. ఈ రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు. పురాణాల విశ్వాసాల ప్రకారం… వసంత పంచమి రోజున రతీ దేవి , మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. మన్మధుడిని ఆరాధించడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుంది.

వసంత పంచమి పూజ విధి
సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా సరస్వతి దేవిని పూజిస్తారు. ముఖ్యంగా విద్య, సాహిత్యం, కళలు, అధ్యయనాలు, బోధన రంగాలకు సంబంధించిన వ్యక్తులకు వసంత పంచమి పండుగ ప్రత్యేకం. ఈ రోజున పుస్తకాలు, పెన్నులు అమ్మవారి ముందు పెట్టి ఆరాధిస్తారు. తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. అంతేకాదు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం కూడా జరిపిస్తారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుందని విశ్వాసం. సరస్వతీ దేవిని వసంత పంచమి రోజున ఉదయం పూజించాలి. పసుపు బట్టలు ధరించి, నుదుటిపై పసుపుని తిలకంగా ధరించి పూజించాలి. సరస్వతీ దేవి పూజలో పసుపు బట్టలు, పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు, పసుపు, పసుపు రంగులను ఉపయోగించాలి. ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం, విచక్షణ, కీర్తి లభిస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vasant Panchami "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0