Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is the importance of Rangoli? Importance of Muggu

ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి?

What is the importance of Rangoli? Importance of Muggu

మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గు ల అర్థం పరమార్థం ఏంటి అనేది తెలుసుకుందాం.

ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి.

ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి.

ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.

ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గు లలో కూడా మనకు తెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు,

యంత్రాలు కూడా!... యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం ముగ్గు గు వేసి దీపారాధాన చేయాలి!

యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి.... దైవకార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి!

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయం లోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళి గానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చింది కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు!

ఈ మధ్యకాలంలో ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తున్నారు... .దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి!

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.

ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి.

పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు.అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.

ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు.శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే,అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.

మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు... మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్థాలు, పరమార్ధాలతో కూడినవి.

హిందూ సనాతన సంప్రదాయాలు గౌరవిద్దాం పాటిద్దాం.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is the importance of Rangoli? Importance of Muggu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0