What should you see when you wake up in the morning? Let's find out what not to watch.
ఉదయం నిద్రలేవగానే వేటిని చూడాలి ? వేటిని చూడకూడదు తెలుసుకుందాం.
కొంత మంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా.. అదృష్టం కలసి రాకపోయినా.. అంతా చెడే జరుగుతున్నా.. ఉదయం నిద్ర లేచి దేన్ని చూశామో కదా.. అందుకనే ఇలా జరుగుతుంది అనుకుంటుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం నిజానికి ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని చూడకూడదు. ఇక అదృష్టం కలసి రావాలంటే నిద్ర లేవగానే కొన్నింటిని చూడాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేవగానే చూడాల్సినవి
- నిద్రలేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణున్ని చూస్తే మంచిది. వారి అదృష్టం మనకు కూడా పడుతుందంటారు.
- ఉదయం నిద్ర లేస్తూనే గోవును గానీ, తులసి మొక్కను గానీ చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో, తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచాక అగ్ని, దీపం చూడాలి. అలాగే యజ్ఞం చేసే వారిని చూసినా శుభం కలుగుతుంది. వాటిని మంగళకరానికి చిహ్నాలుగా భావిస్తారు. అందువల్ల వాటిని చూస్తే అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో మన రూపాన్ని మనం చూసుకోవచ్చు. దీంతో అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచాక బంగారం, సూర్యుడు, ఎర్ర చందనంలను చూడవచ్చు. దీంతో అన్ని పనులు జరుగుతాయి. అదృష్టం కలసి వస్తుంది.
- ఉదయం నిద్ర లేచాక సముద్రం, గుడి గోపురం, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది
- దూడతో ఉన్న ఆవు లేదా పురుషులు తమ భార్యలను తాము చూసుకున్నా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్ర పటాలు, నెమలి కన్నుల చిత్రాలు, పువ్వులు చూస్తే శుభం కలుగుతుంది.
ఉదయం నిద్ర లేవగానే వీటిని చూడరాదు
- ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపం చేసే వారిని చూడరాదు. చూస్తే మనకు ఆ పాపం అంటుకుంటుందని చెబుతారు.
- జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీలను, బొట్టులేని స్త్రీలను చూడరాదు.
- క్రూర జంతువులు లేదా వాటి చిత్రపటాలను కూడా చూడకూడదు.
- శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని అంటారు.
0 Response to "What should you see when you wake up in the morning? Let's find out what not to watch."
Post a Comment