Election duty for the staff of the Secretariat!
టీచర్లకు గుడ్‌బై
- ఇక ఎన్నికల డ్యూటీ సచివాలయ సిబ్బందికి!
- ఎన్నికల విధుల నుంచి1.91 లక్షల మంది టీచర్ల తొలగింపు
- వారి స్థానంలో 1.31 లక్షల మంది సచివాలయ సిబ్బంది
- ఎన్నికల నిర్వహణలో అనుభవం శూన్యం
- నిష్పాక్షికంగా, నిర్భయంగా విధులు కష్టమే
- వైసీపీ నేతల కనుసన్నల్లోనే గ్రామ సచివాలయాలు
- మొదటి నుంచీ సర్కారు గుప్పిట్లోనే ఆ సిబ్బంది
- వారి డిమాండ్లు పరిష్కరించకుండా ఆటలు
- ఎన్నికల్లో టీచర్లతో ప్రమాదమని సర్కారు ఆందోళన
- బోధనేతర’ సాకుతో ఎన్నికల విధుల నుంచి ఔట్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించడం ఖాయమైంది. 1.91 లక్షల మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం చేయడంతో... వారి స్థానంలో 1.31 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీలు వేయనున్నారు. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది! టీచర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులను ఎన్నికల్లో వాడుతున్నారా? లేక... సచివాలయ ఉద్యోగులకు ఆ అవకాశం కల్పించేందుకే టీచర్లను ఎన్నికల విధుల నుంచి దూరం చేశారా? లోతుగా విశ్లేషిస్తే... ఉపాధ్యాయులు ఎన్నికల డ్యూటీల్లో ఉంటే తమకు నష్టమని, అందుకే వారిని పక్కకు తప్పించి, వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులను చేర్చారని స్పష్టంగా తెలుస్తోంది. ఇదో... పెద్ద రాజకీయ/ఎన్నికల వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో ఏమాత్రం అనుభవం లేని సచివాలయ ఉద్యోగులతో ఎన్నికల నిర్వహణ క్లిష్టంగా మారుతుందని పేర్కొంటున్నారు.
వైసీపీ ఎన్నికల మేనేజ్‌మెంట్!
ఎన్నికల్లో ఓట్లు వేసేది ప్రజలు. గత సార్వత్రిక ఎన్నికల్లో అనేక గిమ్మిక్కులు చేసి ఓటర్లను వలలో వేసుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు.. అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో... ‘జనంతో సంబంధంలేని పోల్ మేనేజ్‌మెంట్’పై వైసీపీ దృష్టి సారించింది. వలంటీర్లు ఇందులో భాగమే! ఆ తర్వాత వలంటీర్లపై పార్టీ తరఫున పెత్తనానికి గృహ సారథులు, కన్వీనర్లను రంగంలోకి దించింది. చివరగా... ఉపాధ్యాయులను పక్కకు నెట్టేసి, సచివాలయాల సిబ్బంది ద్వారా ‘అనుకూల’ ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది.
0 Response to "Election duty for the staff of the Secretariat!"
Post a Comment