Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Exemptions under Section 80C.

సెక్షన్ 80సీ కిందకి వచ్చే మినహాయింపులు.

Exemptions under Section 80C.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: 

  • ఐదేళ్ల కాలపరిమితితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.
  • పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(PPF)పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ లభిస్తుంది.
  • ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ELSS లో వచ్చే రాబడిపై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్ ట్యాక్స్‌ ఉంటుంది. అయితే, రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు.
  • నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం ద్వారా లభించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
  • మనం చెల్లించే వివిధ రకాల ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు కూడా మినహాయింపు ఉంటుంది. అయితే, ఆ ప్రీమియంల మొత్తం రూ.1.5 లక్షలు మించకూడదు. అలాగే బీమా విలువ వార్షిక ప్రీమియానికి పదింతలు ఉండాలి.
  • గృహ రుణ చెల్లింపులో ఏటా చెల్లించే అసలులో రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
  • పిల్లల చదువు కోసం చెల్లించే వార్షిక ట్యూషన్‌ ఫీజులో రూ.1.5 లక్షల వరకు రాయితీ ఉంటుంది.
  • సంఘటిత రంగంలో ఉండే ఉద్యోగుల వేతనాల నుంచి 12 శాతం ఈపీఎఫ్‌లో కలిసిపోతుంది. ఏటా రూ.1.5 లక్షల ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉంది.
  • సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)లో పెట్టే పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈ స్కీమ్‌ 60 ఏళ్లు పైబడి వారి ఐదేళ్ల కాలపరమితితో అందుబాటులో ఉంది.
  • స్టాంప్ డ్యూటీ  కొత్తగా ఇల్లుకొనేటప్పుడు స్టాంప్ డ్యూటీ (రిజిస్ట్రార్ ఆఫీస్ లో) కట్టిన మొత్తం మినహాయించుకోవచ్చు. 

సుకన్య సమృద్ధి యోజన:

  • 10 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు ఈ పథకంలో మదుపు చేసినట్లయితే.. వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది.
  • NPS నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌.
  • నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పెట్టుబడిపై సెక్షన్‌ 80సీసీడీ(1బి) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
  • 80D హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం.
  • 80D ఆరోగ్య బీమా కోసం ఏటా చెల్లించే ప్రీమియంలలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది సెక్షన్‌ 80డీ పరిధిలోకి వస్తుంది. సెక్షన్‌ 80సీ కింద ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు లభిస్తున్న మినహాయింపునకు ఇది అదనం.

హెచ్‌ఆర్‌ఏపై ఇలా. HRA

  • మీ వేతనంలో హెచ్‌ఆర్‌ఏ కూడా కలిపి ఉంటే.. ఆ మొత్తానికి పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉంది.
  •  అయితే, దీనికి కొంత గరిష్ఠ పరిమితి ఉంటుంది. 
  • ఒకవేళ హెచ్‌ఆర్‌ఏ రాకపోయినా.. అద్దె చెల్లిస్తున్నట్లయితే, ఏటా రూ.60 వేల వరకు పన్ను మినహాయింపు కోరేందుకు వెసులుబాటు ఉంది.

గృహ రుణంపై చెల్లించే వడ్డీ.

  • గృహ రుణంపై చెల్లించే అసలుపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తే.. ఐటీ చట్టం సెక్షన్‌ 24 ప్రకారం.. ఏటా చెల్లించే రూ.1.5 లక్షల గృహరుణ వడ్డీకి కూడా పన్ను రమ్ములో రూ.10,000 వరకు సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్స్‌ అయితే ఈ పరిమితి రూ.50 వేల వరకు ఉంటుంది.
  • స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలు..(ఐటి ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మాత్రమే పెట్టుకోవాలి )
  • వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలతో పాటు ధార్మిక కార్యక్రమాలకు చేసే ఖర్చులో 50 శాతం వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏయే విరాళాలు, ధార్మిక కార్యక్రమాలకు పన్ను  మినహాయింపు ఉంటుందో తెలుసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలైతే 80జీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి

సెక్షన్ 24..

  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహరుణ వడ్డీ చెల్లింపులపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు ల‌భిస్తుంది.
  •  నిర్మాణం పూర్తి అయిన త‌ర్వాత‌ మాత్రమే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవాలి. 
  • ఒకవేళ‌ నిర్మాణ సమయంలో వడ్డీ చెల్లించి ఉంటే నిర్మాణం పూర్తైన తరువాత 5 ఏళ్ళల్లో(వాయిదాలలో) అప్పటి వరకు చెల్లించిన వడ్డీని ఏడాదికి 20 శాతం చొప్పున క్లెయిమ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 80ఈఈఏ.

  • ఆదాయంపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 లిమిట్ పూర్తైన తర్వాత మాత్రమే సెక్షన్ 80ఈఈఏ కింద డిడక్షన్ పొందేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్ కింద రూ. 1.50 లక్షల వరకు అదనపు తగ్గింపు పొందచ్చు. ఇది 'అఫ‌ర్డ‌బుల్‌' గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర నిబంధనలు ఉన్నాయి. 
  • మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసి ఉండాలి. రుణం తీసుకునే నాటికి ఎటువంటి నివాస గృహం.. రుణం తీసుకున్న వ్యక్తి పేరుపై ఉండకూడదు. 
  • ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందేందుకు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి ఏప్రిల్ 1, 2021
  •  ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 24 మాత్రమే కాకుండా ఇంకా వేరు సెక్షన్లలో ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది అని. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సంబంధించిన సెక్షన్ల గురించి ఓసారి చూద్దాం.

సెక్షన్ 24 : ఈ సెక్షన్ లో గరిష్టంగా 2లక్షల వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి మినహాయింపు కలదు.

Govt subsidy schemes Project Report, [19-05-2022 23:53]

నిబంధనలకు లోబడి సెక్షన్ 24 కి అదనంగా ఇంట్రెస్ట్ మినహాయింపు ఉన్న సెక్షన్ల వివరాలు నిబంధనలు ఏంటి ఎవరికి వర్తించవచ్చు అనేది చూద్దాం.

సెక్షన్ 80EE : సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ సెక్షన్ లో గరిష్టంగా 50,000 వరకు అదనపు మినహాయింపు కలదు.

80 EE వర్తింపు నిబంధనలు :

  • 1.లోన్ FY 2016-17 (01.04.2016 నుండి 31.03.2017 మధ్య) లో మాత్రమే తీసుకుని ఉండాలి.
  • 2. హోమ్ లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని ఉండాలి.
  • 3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.
  • 4. వారు ఈ ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం 35లక్షలు లేదా 35లక్షల లోపు ఉండాలి.
  • 5. ఇట్టి ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 50లక్షలు లేదా 50లక్షల లోపు ఉండాలి.
  • పై 5 నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 50,000 మినహాయింపుకు అర్హులు.

సెక్షన్ 80EEA : సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ సెక్షన్ లో గరిష్టంగా 1,50,000 వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి అదనపు మినహాయింపు కలదు.

80 EEA వర్తింపు నిబంధనలు :

  • 1. లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని ఉండాలి.
  • 2. లోన్ FY 2019 -20 (01.04.2019 నుండి 31.03.2020 మధ్య) లో మాత్రమే తీసుకుని ఉండాలి.
  • 3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.
  • 4. రిజిస్ట్రేషన్ కోసం ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 45లక్షలు లేదా 45లక్షల లోపు విలువ ఉన్న ఇంటికి స్టాంప్ డ్యూటీ చెల్లించి ఉండాలి.

పై రెండు సెక్షన్లు (80EE & 80EEA) నిబంధనలు సంతృప్తికరంగా ఉన్నవారు మాత్రమే అదనపు మినహాయింపు వర్తిస్తుంది.

డి.డి.ఓ లకు సెక్షన్ 192 ప్రకారం ఉద్యోగులకు చెల్లించిన వేతనాలకు ఆదాయ పన్ను ఎలా గణించాలి ఎలాంటి సెక్షన్ల ప్రకారం మినహాయింపులు ఉంటాయి అనేది తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాయు సర్క్యూలర్ జారీ చేస్తారు. ఈ సంవత్సరం జారీ చేసిన సర్క్యూలర్ 20/2020.

మార్చి 31,22 మధ్య రుణం మంజూరు అయ్యి ఉండాలి. 

ఆస్తి స్టాంప్ డ్యూటి విలువ రూ. 45 లక్షలకు మించకూడదు. 

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ. 1.50 లక్షలు,  సెక్షన్ 24 కింద రూ.2 లక్షలు,  సెక్షన్ 80ఈఈఏ కింద రూ. 1.50 లక్షలు మొత్తంగా రూ. 5 లక్షల వరకు పన్ను రిబేట్ పొందే అవకాశం ఉంది.

NCOME TAX సమర్పించునపుడు ఇంటి అద్దె విషయం పై వివరణ

  • 1) ఇంటి కిరాయి ఒక నెలకు 3,000₹ లోపు అనగా సంవత్సరం మొత్తాని 36,000₹ లోపు చెల్లించినట్లు చూపితె కిరాయి రిసిప్టు అవసరం లేదు.
  • 2) ఇంటి కిరాయి ఒక నెలకు 8,333₹ లోపు అనగా సంవత్సరం మొత్తాని 1,00,000₹ లోపు చెల్లించినట్లు చూపితె కిరాయి రెవెన్యు స్టాంపు పై ఇంటి ఓనరు సంతకంతో రిసిప్టు సమర్పించాలి.
  • 3) ఇంటి కిరాయి ఒక నెలకు 8,334₹ కంటె ఎక్కువ అనగా సంవత్సరం మొత్తాని 1,00,000₹ కంటె ఎక్కువ చెల్లించినట్లు చూపితె కిరాయి రెవెన్యు స్టాంపు పై ఇంటి ఓనరు సంతకంతో రిసిప్టు మరియు ఇంటి ఓనరు ప్యాన్ కార్డ్ కూడ సమర్పించాలి.
  • పైన చెప్పిన విధంగా Rent Receipt ఇవ్వగలిగినవారు క్రింది విధంగా IT లో Rent ను చూపించవచ్చు.

NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్).

ఆదాయపన్ను తగ్గింపు కావాలని కోరుకునే పాత పెన్షన్  ఉన్న ఉద్యోగులు (సి.పి.ఎస్. వారికి తప్పనిసరిగా ఉంటుంది)  తప్పక పరిశీలించదగిన ఉత్తమ పెట్టుబడి సాధనం... NPS

సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ పథకాల్లో ప్రభుత్వ ప్రాయోజిత నేషనల్ పెన్షన్ సిస్టమ్  ముఖ్యమైనది. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వేతర ఉద్యోగులకు ఉపయోగపడే పథకం ఇది. PFRDA ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.

తక్కువ రిస్క్, అధిక రిటర్న్స్ అందించే పెట్టుబడి సాధనం ఎన్పీఎస్. 

            పన్ను ప్రయోజనాలతో పాటు పదవీ విరమణ అనంతరం అధిక రాబడిని అందిస్తుంది. 

          18 -70 సంవత్సరాల వయస్సు ఉన్న ఎవరైనా NPS సభ్యత్వం తీసుకోవచ్చు.

ఈ పథకంలో 75 ఏళ్ల వరకు కొనసాగేందుకు అనుమతిస్తుంది.

మొత్తం వెనక్కి

రూ.5 లక్షల లోపు ఎన్పీఎస్ నిధి ఉంటే పదవీ విరమణ చేసినా.. స్కీం నుండి బయటకు రావాలని అనుకుంటే ఈ మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఎన్పీఎస్ నుండి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు. రూ.2లక్షల మొత్తం దాటితే పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40 శాతంతో బీమా సంస్థలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఎలాంటి యాన్యుటీ పథకాలను కొనాల్సిన అవసరం లేదు. 

         ఉప‌సంహ‌ర‌ణ మొత్తంలో 60 శాతం ప‌న్నుర‌హితంగా ప‌రిగ‌ణిస్తారు. మిగ‌తా 40 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది.

Govt subsidy schemes Project Report, [19-05-2022 23:53]

జాతీయ పెన్షన్ పథకం పన్ను ప్రయోజనాలు:

  •          ₹ 50 వేల రూపాయల వరకు పెట్టుబడులు సెక్షన్ 80 CCD (1B) కింద మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80C కింద ఉండే ₹150,000 పరిమితి కి అదనం. దీర్ఘకాల పొదుపు, పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే నిశ్చింతగా  NPSలో పెట్టుబడి పెట్టవచ్చు.. 
  • NPS పథకంలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస మొత్తం సంవత్సరానికి ₹ 6,000.
  • ఏప్రిల్ నుండి ప్రారంభించి నెలకు 4 వేలు ..సం. నికి 50 వేలు పొదుపు చేస్తే 20% పన్ను పరిధిలోని వారు సుమారు ₹10 వేల పన్ను ప్రయోజనం వెంటనే పొందుతారు. 
  • పదవీ విరమణ సమయంలో, సేకరించిన సంపదపై 40 శాతం వరకు ఉపసంహరణ పన్ను నుండి మినహాయించబడుతుంది. అయితే, మీరు పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకోగల గరిష్ట కార్పస్ 60 శాతం (పోగుచేసిన సంపదలో) మరియు మిగిలిన మొత్తాన్ని, అంటే, చందాదారునికి నెలవారీ పెన్షన్‌ను అందించే యాన్యుటీ కొనుగోలు కోసం 40 శాతం ఉపయోగించాల్సి ఉంటుంది.
  • చందాదారుడు మరణించిన సందర్భంలో ఉపసంహరించబడిన కార్పస్ పన్ను నుండి మినహాయించబడుతుంది. సేకరించబడిన మొత్తం సంపద వినియోగదారు యొక్క చట్టపరమైన నామినీకి చెల్లించబడుతుంది.
  • 80Dమెడికల్ ఖర్చులు జి పే ఫోన్ పై చేసి ఉండాలి అది ఈ ఫైలింగ్ లో పెట్టుకోవాలి 
  • 80/DD/DDB ఇంట్లో వారు ఎవరన్నా అంగవైకల్యం,  మానసిక ఎదుగుదల లేకపోవడం,కాన్సర్, కిడ్నీ తొలగింపు, బాడీ ఏదన్న పార్ట్ తొలగించబడిన ఈ ఫైలింగ్ లో పెట్టుకోవాలి 
  • 80G విరాళాలు కట్టి ఉంటె అవి ఈ ఫైలింగ్ లో పెట్టుకోవాలి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Exemptions under Section 80C."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0