Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A check for spam messages.. No more scams by cybercriminals.

 Spam Text స్పామ్‌ మెసేజ్‌లకు చెక్‌.. ఇకపై సైబర్‌ నేరగాళ్ల మోసాలు చెల్లవు.

A check for spam messages.. No more scams by cybercriminals.

ఇంట్లో ఉంటూనే ప్రతిరోజు వేలల్లో సంపాదించుకోండి, కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే మీ కార్డు బ్లాక్‌ అవుతుంది. లాంటి మెసేజెస్‌తో విసిగిపోతున్నారా?

త్వరలో మీకు ఈ పీడ విరగడకానున్నది. ఏది స్కామ్‌, ఏది స్పామ్‌? దేన్ని నమ్మాలో తెలియక మోసపోతున్న సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఊరట కలిగించే వార్త ఇది. 

ఇంట్లో ఉంటూనే ప్రతిరోజు వేలల్లో సంపాదించుకోండి, కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే మీ కార్డు బ్లాక్‌ అవుతుంది. లాంటి మెసేజెస్‌తో విసిగిపోతున్నారా? త్వరలో మీకు ఈ పీడ విరగడకానున్నది. ఏది స్కామ్‌, ఏది స్పామ్‌? దేన్ని నమ్మాలో తెలియక మోసపోతున్న సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఊరట కలిగించే వార్త ఇది. సెల్‌ఫోన్‌కు వచ్చే ఇలాంటి స్పామ్‌ మెసేజ్‌లను కట్టడి చేసే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానున్నది.

హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. సోమవారం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ప్రపంచస్థాయి సదస్సులో హైదరాబాద్‌కు చెందిన తాన్ల అనే ఐటీ కంపెనీ వైజ్‌లీ ఏటీపీ (Wisley ATP)పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ పనితీరును ప్రదర్శించింది. దీనిద్వారా 99శాతం స్పామ్‌,ఫిషింగ్‌ మెసేజ్‌లను కట్టడి చేయవచ్చని నిరూపితమైంది. త్వరలో ఇది అందుబాటులోకి రానున్నది. నిత్యం వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తూ ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు దోచేస్తున్నారు. వైజ్‌లీ ఏటీపీతో ఇలాంటి మోసాలకు చెక్‌పెట్టొచ్చని తాన్ల కంపెనీ భరోసానిస్తున్నది.

ఎలా పనిచేస్తుంది?

తాన్లా'.. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను జోడించి యూజర్‌ ఎండ్‌ టు ఎండ్‌ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. సెల్‌ఫోన్లకు వచ్చే అనుమానిత మెసేజ్‌లను గుర్తించే వైజ్‌లీ ఏటీపీ ఎండ్‌ టు ఎండ్‌ ఫిషింగ్‌ ప్రొటెక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫోన్లకు వచ్చే స్పామ్‌ మెసేజ్‌లను నిరోధిస్తుంది. విశ్వసనీయ బ్రాండ్‌లు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు గ్లోబల్‌ యాంటి ఫిషింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌గా ఏటీపీని ఉపయోగించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాల వల్ల 55 బి లియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని గ్లోబ ల్‌ యాంటీ స్కామ్‌ అలయెన్సెస్‌ వెల్లడించిం ది. తాన్లా అందుబాటులోకి తెచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌ సెల్‌ఫోన్లకు వచ్చే అనుమానిత మెసేజ్‌ల సమాచారాన్ని ఆయా ఫోన్ల నెట్‌వర్క్‌ ప్రొవైడర్లకు, గూగుల్‌, వాట్సాప్‌, దర్యాప్తు ఏజెన్సీల దృష్టికి తీసుకొస్తుంది. దీంతో పాటు వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A check for spam messages.. No more scams by cybercriminals."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0