Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Advice given by Dr. Devi Shetty, Heart Specialist, Narayana Hrudayalaya, Bangalore

 నారాయణ హృదయాలయ, బెంగుళూరు హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దేవి శెట్టి గారు ఇచ్చిన సలహాలు

Advice given by Dr. Devi Shetty, Heart Specialist, Narayana Hrudayalaya, Bangalore

 ప్రశ్న 1 : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ? 

 జవాబు : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.

2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం

3)ధూమ పానం మానడం.

4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.

5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.

 ప్రశ్న 2. కొవ్వును కండగా మార్చుకొగలమా ?

 జవాబు: ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.

కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం.

కొవ్వు కండగా మారదు.

 ప్రశ్న 3 : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 

 జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

 ప్రశ్న 4 : గుండె పోటు వంశ పారం పర్యమా?

 జవాబు : అవును 

 ప్రశ్న 5 : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది?

ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )

 జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి.

ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.

 ప్రశ్న6 : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?

జవాబు : నడక మంచిది.

జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.

 ప్రశ్న 7: మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?

 జవాబు :వివేకానంద స్వామి !

 ప్రశ్న 8: లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?

 జవాబు : చాలా తక్కువ

 ప్రశ్న 9 : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా(నా వయసు 22).30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?

 జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.

 ప్రశ్న 10 : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?

 జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు.

ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.

 ప్రశ్న 11: మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?

 జవాబు: ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.

 ప్రశ్న 12: గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?చెడ్డ ఆహారం ఏది?

 జవాబు :పళ్ళు , కాయగూరలూ మంచివి.

నూనెలు చెడ్డవి.

 ప్రశ్న 13: ఏ నూనె మంచిది ?

సన్ ఫ్లవర్,వేరుశనగ నూనె,ఆలివ్ ఆయిల్ ?

 జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే.

 ప్రశ్న 14: ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?

 జవాబు :రొటీన్ షుగర్,బి.పి,కొలెస్టరాల్ చాలు .ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.

 ప్రశ్న 15 : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?

 జవాబు: గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి.ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి 

 సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి .వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి.మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .

 ప్రశ్న : 16 :గ్యాస్ట్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ? 

 జవాబు : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.

 ప్రశ్న 17:యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )

 జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది. అందు వలన కేసులు కనిపిస్తున్నాయి.జీవన విధానం( బద్ధకం ), జంక్ ఫుడ్,వ్యాయామం లేక పోవడం, పొగ తాగడం.మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.

 ప్రశ్న 18 : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా? 

 జవాబు : ఉంటారు.

 ప్రశ్న 19 : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు.వాస్తవమా?

 జవాబు : వాస్తవమే!దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు. 

 ప్రశ్న 20 : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం. ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?

 జవాబు: మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది.ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి. కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.

ప్రశ్న 21: ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )

 జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.

ప్రశ్న 22: కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? 

 జవాబు : లేదు.

 ప్రశ్న 23 : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?

 జవాబు : లేదు 

 ప్రశ్న 24 : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?

జవాబు :వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.

 ప్రశ్న 25 :భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!

 జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.

 ప్రశ్న 26 : అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?

 జవాబు : నో.

 ప్రశ్న 27 :  గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?

 జవాబు : వెల్లకిలా పడుకోవాలి .

నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.

అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.

 ప్రశ్న 28 : లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?

జవాబు : కావు.

కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.

 ప్రశ్న 29 : మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు.

ఇంట్లో నడవడం, మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?

 జవాబు : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.

 ప్రశ్న 30 : షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?

 జవాబు : ఉంది.

షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.

 ప్రశ్న 31 : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

 జవాబు : 

ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.

 ప్రశ్న 32 : రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?

 జవాబు : నో .

 ప్రశ్న 33 :Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?

 జవాబు :

కొన్ని వందలు ఉన్నాయి .

మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు.

కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక).

ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.

 ప్రశ్న 34 : డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?

 జవాబు : అవును

 ప్రశ్న 35 :ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?

 జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)

 ఆఖరు ప్రశ్న : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ? 

 జవాబు :

ఆరోగ్య వంత మైన ఆహారం తినండి.

ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి.

జంక్ ఫుడ్ తినకండి.

స్మోకింగ్ మానండి

30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ )

మీకు ఇతరులకు మేలు చెయ్యాలి అనే హృదయం ఉంటె మీరు చదువుతున్న ఈ మెసేజ్ మీ మిత్రులకు, బందువులకు షేర్ చేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Advice given by Dr. Devi Shetty, Heart Specialist, Narayana Hrudayalaya, Bangalore"

Post a Comment