Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

An interesting update in WhatsApp, now you can select and pin the necessary messages.

 WhatsApp: వాట్సాప్ లో ఆసక్తికర అప్ డేట్, ఇకపై అవసరమైన మెసేజ్ లను ఎంచక్కా పిన్ చేసుకోవచ్చు.

An interesting update in WhatsApp, now you can select and pin the necessary messages.

వాట్సాప్.. మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. సమచార మార్పిడి కి మొత్తం దీని ఆధారంగానే సాగుతోంది. అది బిజినెస్ అయినా, కుటుంబమైనా, వ్యక్తిగతమైనా ఏదైనా వాట్సాప్ నే అందరూ వినియోగిస్తున్నారు.

ఇదే క్రమంలో వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా యాప్ ను తీర్చిదిద్దేందుకు మెటా యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికప్పుడు కొత్తకొత్త అప్ డేట్ లను తీసుకొస్తూ యూజర్లకు మంచి అనుభూతినిస్తోంది. ఇ దే క్రమంలో మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్ యూజర్లు గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌లలోని మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతించేలా కొత్త ఫీచర్ ఉంటుందని వాబీటాఇన్ ఫో(WABetaInfo) నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం రాబోయే ఫీచర్ వాట్సాప్ యూజర్ల గ్రూప్‌ల నుంచి లేదా పర్సనల్ చాట్‌ల నుంచి చాట్‌లో పైభాగంలో ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ని రిలీజ్ చేసిన తర్వాత యూజర్‌లు మెసేజ్‌లను పిన్ చేయవచ్చు. ఈ పిన్ చేసిన మెసేజ్‌లు గ్రూప్‌లలో ఆర్గనైజ్డ్ చాట్‌లను మెరుగుపరచడంలో సాయపడతాయి. ఎందుకంటే.. వినియోగదారులు తమ ముఖ్యమైన చాట్‌లను సులభంగా యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్ పాత వెర్షన్‌ని ఉపయోగిస్తే.. ప్లే  స్టోర్ నుంచి యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే..

ప్రస్తుతానికి, చాట్‌లు, గ్రూప్‌లలో మెసేజ్‌లను పిన్ చేసే ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కూడా కొత్త ఫీచర్‌పై పని చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు సులభంగా కాల్‌లు చేసేందుకు సాయపడుతుందని నివేదిక సూచిస్తుంది. ఈ ఫీచర్ యాప్‌ని ఉపయోగించి కాల్స్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. కాంటాక్టుల లిస్టును త్వరగా యాక్సెస్ చేసేందుకు అప్లికేషన్‌ను ఓపెన్ చేయకుండానే కాల్‌లు చేసేందుకు వీలు కల్పిస్తుంది. వాట్సాప్ కాంటాక్టుల కోసం కస్టమైజడ్ షార్ట్‌కట్‌లను సెటప్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. దీంతో యూజర్లు త్వరగా కాల్స్ చేసుకోవచ్చు.

మెసేజ్ చేసినంత ఈజీగా కాల్..

వాట్సాప్ లో కాల్‌లను మెసేజ్‌లు పంపినంత సులువుగా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అప్లికేషన్‌తో కలిపి వాట్సాప్ కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ కాంటాక్ట్ లిస్ట్‌లోని కాంటాక్ట్ సెల్‌ను ట్యాప్ చేయడం ద్వారా యూజర్లను ఈజీగా కాలింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాక.. కొత్త రాబోయే ఫీచర్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డివైజ్ హోమ్ స్క్రీన్‌కు ఆటోమాటిక్‌గా యాడ్ చేస్తుందని నివేదిక సూచిస్తుంది.

మన దేశంలో 36 లక్షల అకౌంట్లు బ్యాన్..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, నవంబర్‌లో భారత్‌లో36.77 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. అయితే ఈ సంఖ్య.. గత నెలలో నిషేధించిన వాట్సాప్ అకౌంట్ల సంఖ్య కన్నా స్వల్పంగా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. భారత్‌లో నిషేధించిన వాట్సాప్ అకౌంట్లలో 13.89 లక్షల అకౌంట్లు ఉన్నాయి. వాట్సాప్ యూజర్లను ఫ్లాగ్ చేసేందుకు ముందస్తుగా హెచ్చరించింది. డిసెంబర్‌లో, వాట్సాప్ దేశంలో 37.16 లక్షల అకౌంట్లను నిషేధించింది. ఇందులో 9.9 లక్షల అకౌంట్లు ముందుగానే బ్యాన్ అయ్యాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "An interesting update in WhatsApp, now you can select and pin the necessary messages."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0