Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP : New rule in Group-2, Group-3 job recruitment

AP : గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్

AP : New rule in Group-2, Group-3 job recruitment

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల్లో కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది. ఈ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఇక నుంచి తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ టెస్టును ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తుందని తెలిపింది.

ఈ సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ కూడా గ్రూప్ 2, గ్రూప్3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్‌హక్ నిబంధనలు జారీ అయ్యాయి.

వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం, ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది.

డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP : New rule in Group-2, Group-3 job recruitment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0