Cow Hug Day vs Valentine's Day
Cow Hug Day vs Valentine's Day: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ..!
ఫిబ్రవరి 14వ తేదీ అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది వాలంటైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు.
రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. ఇవన్నీ వచ్చేది ఈ నెలలోనే. ఇది భారతీయ సంస్కృతి కాదనే వాదనలు లేకపోలేదు. వాలంటైన్స్ డే ను అడ్డుగా పెట్టుకుని అవాంఛిత కార్యకలాపాలకు దిగుతుంటారనే విమర్శలు లేకపోలేదు.
బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఈ లవర్స్ డేకు వ్యతిరేకం. ఇది తమ సంస్కృతి కాదని, వెస్ట్రన్ కల్చర్ ను భారతీయులెవరూ ప్రోత్సహించకూడదనేది వారి ఉద్దేశం. అందుకే- వాలంటైన్స్ డే నాడు బజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులు పార్కుల్లో మోహరిస్తుంటారు. తమ కంటికి కనిపించిన ప్రేమజంటలను అప్పటికప్పుడు పెళ్లి చేస్తుంటారు. పార్కుల్లో లవర్స్ మీద వారు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లల్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీని కౌ హగ్ డే గా జరుపుకోవాలంటూ దేశ ప్రజలను సూచించింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ బోర్డ్ ఇవ్వాళ సర్కులర్ ను జారీ చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ నాడు ప్రతి ఒక్కరు గోవును ఆలింగనం చేసుకోవాలని, మూగప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకోవాలని పేర్కొంది. గోవులు, ఇతర మూగజీవులను ప్రేమించడం భారత సంస్కృతిలో ఒక భాగమని గుర్తు చేసింది.
హైందవ సంప్రదాయంలో గోవులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావిస్తారని తెలిపింది. దేశంలో వైదిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోవడానికి విదేశీ సంస్కృతి కారణమౌతోందని, దీన్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 14వ తేదీ నాడు వాలంటైన్స్ డే కు బదులుగా కౌ హగ్ డే ను జరుపుకోవాలని పశు సంవర్ధక శాఖ బోర్డ్ విజ్ఞప్తి చేసింది. దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
పశు సంపద ప్రపంచ వ్యాప్తంగా జీవ వైవిధ్యాన్ని కాపాపాడుతోందని పేర్కొంది. సమస్త మానవాళికి సిరి అందించే ఆవును గోమాత, కామధేనువుగా భారతీయులు పూజించరుకుంటారని, ఆ సంస్కృతిని కౌ హగ్ డే నాడు గుర్తు చేసుకుందామని పిలుపునిచ్చింది. గోవును ఆలింగనం చేసుకోవడం ద్వారా మానసిక స్థైర్యంతో పాటు వ్యక్తిగత, సామాజికంగా సంతోషాన్ని ఇస్తుందని అభిప్రాయ పడుతుంది.
0 Response to "Cow Hug Day vs Valentine's Day"
Post a Comment